Saturday, October 5, 2024

SREECHAKRADHARINI-04-SARVASAUBHAAGYAPRADA CHAKRAMU




  




    శ్రీచక్రధారిణి-04-సర్వ సౌభాగ్య(ప్రద)చక్రము


    *********************************




 ప్రార్థన


 *******


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై


   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"




 ఇప్పటివరకు


 *********


  అమ్మ దయతో సాధకుడు "సృష్టి త్రయ చక్రములను" దర్శించి త్రితత్త్వమును తెలిసికొని,స్తోత్ర రెండవ భాగమైన "స్థితిచక్ర త్రయము"లోని మొదటిచక్రమైన "సర్వ సౌభాగ్య ప్రద చక్ర ప్రవేశము చేయబోతున్నాడు.


  


 స్తోత్రము


 ********


శ్రీచక్ర చతుర్థావరణదేవతాః


సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,


  పరమేశ్వరుడు ఐదవ ఆవరణమును గురించి పార్వతీదేవి ఈ విధముగా వివరిస్తున్నాడు.


 " చతుర్దశారం  దేవేశి దాడిమీ కుసుమ ప్రభః


   ఆనందఫలదం భద్రే సర్వసౌభాగ్య సంప్రదం"


       దేవేశి  పార్వతి! 


   మన్వస్త్రము గా (మనోవృత్తులు) పిలువబడు ఈ ఆవరణము పదునాలుగు త్రికోణములతో వృత్తాకారముగా ఉంటుంది.సూక్ష్మత్వమునకు గుర్తుగా కోణములతో సంకేతించబడినది.సాధకునికి ఇది హృదయస్థానము.అనాహత చక్రము.


   ఈ 14 త్రికోణములను "సంప్రదాయ యోగినులు" అని కీర్తిస్తారు.వీరు ముముక్షువులకు సంపూర్తిగా పరబ్రహ్మమును తెలిసికొనునటకు,ఉద్ధరించుటకు సహాయపడుతుంటారు.


   భ్రమానందము నుండి బ్రహ్మానందమును పొందుటకు తాము సహకారమనేనిచ్చెనులుగా మారుతారు.


  గురు-శిష్య సంప్రదాయమునకు ప్రతీకలై ఉంటారు.


  ఈశ్వర ఆలోచనమును కలిగించు ఈశిత్వ సిద్ధిమాత ఉంటుంది.


  సర్వ వశంకరీ ముద్ర సత్యాన్వేషణకు బీజము వేస్తుంది.




 పదునాలుగు కోణములను,  


 1.పదునాలుగు లోకములు గాను,


 2 కనుండి -ఢ వరకు వర్ణములుగాను,


 3.పరమాత్మ ఉనికిని గ్రహింపచేయు


     "బ్రహ్మసూత్రములూ గాను అన్వయిస్తారు.


  1.పరబ్రహ్మ ఉనికిని తెలుసుకోవాలనుకొనుటయే "సౌభాగ్యము"


  2.దేహాత్మ భావనమును విడనాడగలుగుటయే "సౌభాగ్యము"



  3.సత్యాన్వేషణమునకు ఉద్యమించుటయే "సౌభాగ్యము"


  4.సంప్రదాయ యోగినుల సహకారము నందుకొనగలుగుటయే" సౌభాగ్యము"


  5..ముఖ్యముగా "వాసి-ని" ఖడ్గమును/గొడ్డలిని ధరించిన "త్రిపురవాసిని చక్రేశ్వరి ఆశీర్వచనముతో అడ్డంకులు తొలగి పోవుట "సౌభాగ్యము.(వాసిని అను పదమునకు నివసించునది/గొడ్డలిని ధరించినది అను అర్థములు)


   అత్యంత ఉత్కృష్టమైన  బ్రహ్మ విచారము ప్రారంభమవుతుంది ఇక్కడ.తనకు తానుగాచేయలేని స్థితి సాధకునిది.గురువుకై అన్వేషము ప్రారంభమవుతుంది.


  పరమేశ్వరుడు సాక్షాత్తుగా తానే ఈశ్వరరూపముగానో-గురురూపముగానో చేయినందిస్తాడు.


 పరబ్రహ్మము


 తత్+త్వం-అసి 


 నీవు నేను-ఉన్నాము అనుకుంటాడు.సాధకుడు.



 భాండ శుద్ధి జరిగిన తరువాత దానిలోని పాకము "మహాప్రసాదమే"








 ఆవరణము "ఈం" అను కామకళా బెజమును కలిగియున్నది.అంతేకాదు,


 హ అనే శివబీజమును+ ర అనే అగ్ని బీజమును_ఈం అను శక్తి బీజమును కలిగి "హ్రీకార" నాదాత్మకమైనది.ఇది మాయా బీజము.


  


  పరబ్రహ్మము ఎవరు?సాకారమా?లేక నిరాకారమా/ప్రత్యాక్షానుభూతిని కలిగిస్తుందా? లేక పరోక్షముగానే ఉంటుందా?ఒకే స్థలములో ఉంటుందాలేక అనేకరూపములతో అనేక విధములుగా ఉంటుందా?ఇంకా ఎన్నెనో సందేహములు


   వీటన్నిటికి కారణము మాయ యను తెరచే కప్పబడియున్న మనసు.




  పోతన గారు దుర్గమ్మను స్తుతిస్తు,


 'తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ" అన్నారు కదా.లోనమ్మకము కలగాలంటే లోతట్టు విచారణము/అంతర్మథనము జరగాలి.ఇక్కడ సత్యావిష్కారము చేయుటకై సత్యాన్వేషణ ప్రారంభము జరుగుంతుంది.సంక్షోభణముతో  ప్రారంభమై స్వంద్వములను క్షయముచేయుటతో ముగుస్తుంది.



   ఇంకొక ముఖ్య విషయము మానవ శరీరములో 72 000 ల నాడులు ఉన్నప్పటికినీ పదునాలుగు నాడులు అత్యంత కీలకమైనవి

.ఇడ-పింగళ-సుషుమ్నా  నాడులు హృదయమునకు రక్తమును శుభ్రపరచి అందిస్తూ,ప్రాణశక్తి రూపముగా ఉంటాయి.మిగతా నాడులు సైతము కీలకపాత్రను పోషిస్తాయి .


 అర్థము చేసుకున్న వారికి చేసుకున్నంత.




  మన ముచ్చట.


  ************


  మన రూపము-అద్దము-ప్రతిరూపము అను మూడింటి  గురించిన ముచ్చట.మనము అద్దములో కనపడటంలేదు.ఏమైందా అని చూస్తే అద్దము విపరీతమైన దుమ్ముతో ఉంది.మన ప్రతిరూపము కనపడాలంటే ఆ దుమ్మునెవరైనా తుడవాలి.వస్త్రముతో కాని/కడగాలి జలముతో కాని.


  ఆ తుడిచే శక్తి గురువు.ఉపయోగపడే వస్త్రమే సంప్రదాయ యోగినులు.తుడవబడు క్రియయే పరమాత్మ కరుణ.వారు ఎప్పుడు చేయినందిస్తూనే ఉంటారు.మనమే అప్పుడప్పుడు పట్తుకోనవసరము లేదులే అనుకుంటుంటాము మాయలో పడి.



   సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


   








 



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...