Thursday, November 14, 2024

TANOTU NAH SIVAH SIVAM-14


  




   తనోతు నః శివః శివం-14


   ********************


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పారవతీ పరమేశ్వరౌ"




   అత్యద్భుతమైనది ప్రస్తుత చరణము.స్తోత్రకర్త సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను గౌరీప్రియునిగా నిర్వహిస్తున్న తాండవము.కీర్తిస్తున్నాడు.




 " చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ


   భాలేక్షణాయ మణికుండల మండితాయ


   మంజీరపాద యుగళాయ జటాధరాయ


   "దారిద్ర్య దుఃఖ దహనాయ" నమశ్శివాయ.




    చరణము


    ********


 కరాళభాళ పట్టికా ధగద్ధగ ద్ధగ జ్వల


 ధనంజయ హుతీకృత ప్రంచండ  పంచసాయకే


 ధరాధరేంద్ర "నందినీ" కుచాగ్రచిత్ర పత్రక


 ప్రకల్పనైక శిల్పిని "త్రిలోచనే" రతిర్మమ.


    1  స్వామి  సూర్యచంద్రులుగా ప్రకాశిస్తున్న  జగదంబ  కుచాగ్రములపై ఆహారములను-ఔషధములను సృష్టిస్తున్నాడు చిత్ర పత్రకమను పేరుతో


  2. ఆ రచనమునకు కారణం స్థితి కార్యము.


  3.సృష్టి స్థితులలకు అడ్దముగా నిలిచిన అజ్ఞానమును/అహంకారమును (మన్మథ బాణములను )   ధనంజయుడై  హుతీకృతమొనరించినాడు.


   అప్పటికిని మన్మథునికి దేవాంగనలు 


 కానిపని మదనా ఇది నీపని కాని పని మదనా


 అహంకరింతువో-హరుని జయింతువో ఇక నీ పని సరి


   నీ విరిశరముల పని సరి అని చెప్పకనే చెప్పారు కామశర దహనము గురించి.


 4. స్వామి మన్మథుని ఫాలభాగములో దాచివేశాడు.దానిని తన విశాలమైన ఫాలభాగమునకు పట్టికగా అమర్చుకున్నాడు జగత్చక్షు  తిరోధానముగా.


  5. రతీదేవి ప్రార్థించగా అమ్మ కోరికగా తిరిగి అనంగునిగా అనుగ్రహించాడు.స్తోత్ర కర్త 


 అమ్మ సర్వమృతునివారిణి కనుక తన స్వామిని


 " ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణాగతం


   జన్మమృత్యు జరావ్యాధి పీడితం కర్మ బంధనై"


   అని అఖిల జగములు సంకీర్తింపచేస్తున్నది.


          తల్లి సదాశివ పతివ్రత-


 ఈ వాక్యమును మనము రెండు విధములుగా సమన్వయించుకోవచ్చును.


    సదా-ఎల్లప్పుడు/అన్నివేళలలో శుభములను అనుగ్రహించే ప్రతిన కలది/వ్రతముగా కలదు.

 

           సదాశివుని వ్రతముచేసి పతిగా పొందినది.


 " భూమౌస్ఖలిత పాదానాం భూమిరేవావలంబికాం


   త్వయీజాత పరాధానాం త్వమేవ శరణం 

 శివే"


     అంటున్నది ప్రార్థనా శ్లోకము.


   మన అజ్ఞానము భూమిని అశుభ్రముగా ఉంచేందుకు సహకరిస్తుంది.మన అహంకారము

 భూమిని తొక్కుతూ,బరువులను విసిరేస్తూ/తవ్వుతూ నొప్పిని కలిగిస్తుంటుంది..హుంకరించి గంతులేసి ఒక్కోసారి నేలపై జారిపడిపోతుంటాము.అయినప్పటికిని

        కు మాతా/కు పితా  న భవతి అన్నట్లుగా ఆ భూమాత


 అయ్యో పడ్డావా నాయనా కాస్త నీ చేతిని నాపై ఊతగా నిలుపుకుని పైకిలే అంటుంది పరమ కరుణాంతరంగముతో/సహనముతో.


   పరమాత్మచే ప్రకటింపబడిన భూమి సహాయమే అతి ఉత్కృష్టమైనది అయినప్పుడు అర్థనారీశ్వర అనుగ్రహమును ఏమని వర్ణించగలను?


   మన్మథుని సంస్కరించిన మహాదేవుడు మంగళగౌరి సమేతుడై మనలను అనుగ్రహించును గాక.




   కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.


    భజ శివమేవ నిరంతరం.


       ఏక బిల్వం శివార్పణం.


 



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-14

      తనోతు నః శివః శివం-14    ********************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పారవతీ పరమేశ్వరౌ"...