Posts

NA RUDRO RUDRAMARCHAYAET-28(SIVANAMDALAHARI)

Image
 శ్లో : సారూప్యం తవ పూజనే శివ మహా-దేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి-ధుర్య-జనతా-సాంగత్య- సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక-తను-ధ్యానే భవానీ-పతే సాయుజ్యం మమ సిద్ధమ్-అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ 28  కరస్థే హేమాద్రి స్లోకములో స్వామి సంపదప్రదుడని కీర్తిస్తు,ప్రస్తుత శ్లోకములో నాలుగు విధములైన ముక్తి రూపములుగా పరమేశ్వరానుగ్రహమును ప్రస్తుతిస్తూ,వాటిలో మూడింటిని సాకార ముక్తిగాను,అవి పొంది తాను కృతార్థుడనైనానని,సాయుజ్యము గురించి స్వామికే వదిలివేస్తున్నానని కృతార్థను తెలియచేస్తున్నారు.  ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.ఏ రూపమో తెలుసుకోలైని మనసు కన్ను అనే ఇంద్రియమును చేరి రూపమును స్వీకరిస్తుంది.అదే పరమేశుని రూపమును ఊహించుకొని దర్శించినప్పుడు దానికి సర్వోపచారములను చేస్తూ సంతసిస్తుంటుంది.దీనిని మనము సారూప్య భక్తిగా భావించవచ్చును.  అంతటితో తృప్తి చెందక మనసు వాగింద్రియమును కూడి సంకీర్తనగా మారి ఆ స్వరూప సమీపమును చేరుతుంది.లేదా ఆ స్వరూపమునకు దగ్గరగా తానున్నానని భావిస్తుంది.  అదే మనసు చెవి అనే ఇంద్రియమును కూడి శ్రవనానందమును పొందుతుది.   సామీప్యమును అందించగలశక్తిని మనసుకు స...

NA RUDRO RUDRAMARCHAYAET-27(SIVANAMDALAHARI)

Image
 శ్లో : కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చింతామణి-గణే శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః 27  ప్ర్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు పరమేశ్వరునకు తన మనసును సమర్పిస్తున్నానని అంతకు మించి తాను అర్పించుటకు స్వామి అడుగుటకు వేరేదేమి లేదని స్వామి వైభవమును ప్రస్తుతిస్తున్నారు.నిజమునకు ఇంతకు ముందు ఆశ్లోకౌలలో పలుమారులు మనసు ప్రస్తావన వచ్చినది.  7.వ శ్లోకములో మనస్తే పాదాబ్జే అంటూ,స్వామి నా మనస్సు నీ పాదపద్మములయందు స్థిరపడియుండునుగాక అన్నారు.  11.వ శ్లోకములో -యదీయం హృత్పద్మం యది భవదధీనం అంటూ మరొక్కసారి నొక్కిచెప్పారు.  12.వ శ్లోకములో సైతము "యస్తైవాంతః కరణం అపి శంభో తవ పదే స్థితం" అని మరీ మరీ చెప్పారు.  అప్పుడు శంకరులవారికి స్వామి అనుగ్రహించిన దర్శనమునకు అతీతముగా ప్రస్తుత శ్లోకములో అనుగ్రహించారేమో అనిపిస్తున్నది.  ఎందుకంటే స్వామి స్థితికారకత్వమునకు సంకేతములుగా ఏవేవి స్వామిని సేవిస్తున్నాయో సంకీర్తిస్తూ,నిజమునకు అవి స్వామి పాదముల దగ్గర సర్వశుభంకరములుగా సన్నుతింపబడుతున్నాయనటం వెనుక సర్వేశ్వర...

NA RUDRO RUDRAMARCHAYAET-26( SIVAANAMDALAHARI)

Image
 శ్లో : కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాన్ఘ్రి- యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లి ష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్ పరిమళాన్ - అలభ్యాం బ్రహ్మాద్యైర్-ముదమ్-అనుభవి ష్యామి హృదయే   ప్రస్తుత శ్లోకము సహస్రారమునుండి ద్రవిస్తు-ఆశీర్వదిస్తున్న సుధాసారమును ప్రస్తావిస్తు,దానిని స్థిరముగా నిలుపుకోవటము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.పూర్వపు శ్లోకము ద్రష్ట్వా అంటూ దర్శనమునకు ముందటి పరిస్థితిని తెలిపితే ప్రస్తుత శ్లోకము దృష్ట్వా అంటు దర్శనభాగ్యమును కలిగించినది.దర్శనము మాత్రమే కాదు స్వామి దివ్య పాదపద్మములను కన్నులలో,శిరములో,కన్నులలో,వక్షములో దాచుకుంటూ,స్వామి పాదపద్మములనుండి పరిమళిస్తున్న సుగంధమును ఆఘ్రాణించే సౌభాగ్యమును ప్రసాదిస్తున్నది.  ఇది కేవలము బాహ్య ఇంద్రియమైన నాసిక గుర్తించకలిగినదికాదు.వసి వాడని,వన్నె తగ్గని పరిమళము అందిస్తున్న పరవశమును పొందే భాగ్యము నేను ఎప్పుడు పొందగలనో కదా.   ఇంద్రియాతీతమైన అనుభవము.మనసు కేంద్రీకృతము అయినప్పుడు మాత్రమే లభించే అనుగ్రహ ఘ్రాణము.కన్నుల్లో దృశ్యమైన ,మనసులో తిష్ఠవేసుకొనిన పాదపద్మములు చేజారిపోకుండా దాచుకునే ప్రయత్నము మ...

NA RUDRO RUDRAMARCHAYET-25(SIVANAMDALAHARI)

Image
 శ్లో : స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్- నియమినాం గణానాం కేళీభిర్ -మదకల-మహో క్షస్య కకుది స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట- వపుషం కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్    ప్రస్తుతశ్లోకములో శంకరులు సదాశివుడు        ఇంతకు పూర్వము అధర్మమును ఏ విధముగా అంతమొందించినో తెలుపు సంకేతములుగా త్రినయనం-మన్మథుని మాయంచేసిన నీ మూడవకన్ను ధర్మమునకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నది.నీ నీలకంఠము అసురత్వమును అణచివేసిన దానికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నది .ధర్మమునకు గ్లాని సంభవింపనీయని  నీ చతురతయే నీ ఒక చేతనున్న( విచ్చలవిడి మనస్తత్త్వమునకు సంకేతమైన) మృగము,మరొక చేతను దానిని దండించగల ఖండపరశువు.   అధర్మము అంతరించిన వేళ జరుపుకొను  ఆనందోత్సాహము బ్రహ్మాదుల స్తవములే కావచ్చును,మునుల జయ జయ ధ్వానముల                  స్తోత్రములే కావచ్చును,ఎద్దుమూపురమునెత్తి వేయు రంకెలే  కావచ్చును,ప్రమథగణములు చేయు వాయిద్య సంబరమైనా కావచ్చును.అంతటి సంతోషమునకు కారణము స్వామి ఉమాశ్లిష్టుడై వారికి సాక్షాత్కారమునొసగుటయే కారణము.నేను సైతము అంత...

NA RUDRO RUDRAMARCHAYET-24

Image
  శ్లో :  కదా వా కైలాసే కనక - మణి - సౌధే సహ - గణైర్ - వసన్ శంభోర్ - అగ్రే స్ఫుట - ఘటిత - మూర్ధాన్జలి - పుటః విభో సాంబ స్వామిన్ పరమ - శివ పాహీతి నిగదన్ విధాతౄణాం   కల్పాన్ క్షణమ్ - ఇవ వినేష్యామి సుఖతః     సదయ సుఖయ- సత్వర దర్శన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థించిన శంకరులు ప్రస్తుత శ్లోకములో " కదావై కైలాసే'అంటూ కనక్మణిశోభితమైన కైలాసములో,ప్రమథగణ సేవుతుడగుచున్న స్వామిని ఎప్పుడు చూడగలుగుతానో కదా అని దీనముగా వేడుకుంటున్నారు.  సందర్శన భాగ్యమును కోరిన ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో సాయుజ్య భక్తిని ప్రసాదించమని కోరుతున్నాఉ.దృష్ట్వా-అదృష్ట్వా అను రెండు పదములతో నిత్యదర్శనానుగ్రహమును కోరిన శంకరులు,మనకు నమస్కార ముద్రను పరిచయము చేస్తున్నారు.ఎనిమిది వేళ్ళూ ఊర్థ్వముఖపయనమునకు సంసిద్ధమైనవేళ,రెండు వేళ్ళు సాధకుని అంతరంగము వైపునకు చూపిస్తూ,దశ ప్రాచీ-దశదక్షిణ అన్న తత్త్వానికి అద్దముపడుతుంటాయి.అద్వైత్వముగా జీవాత్మను ఒకచేతి ఐదువేళ్ళు చూపిస్తుంటే,పరమాత్మను మరో ఐదువేళ్ళుచూపిస్తు,జీవాత్మ-పరమాత్మ సంగమమునకు సంకేతమౌతున్నది.నమస్కారము.  ప్రస్తుత శ్లోకము,  కదావా వినే...

NA RUDRO RUDRAMARCHAYAET-23(SIVAANAMDALAHARI)

Image
  శ్లో :  కరోమి త్వత్ - పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వమ్   దిశసి ఖలు తస్యాః ఫలమ్ - ఇతి పునశ్చ త్వాం ద్రష్టుమ్   దివి భువి వహన్ పక్షి - మృగతామ్ - అదృష్ట్వా  తత్ - ఖేదం కథమ్ - ఇహ సహే శన్కర విభో      23 సాధకుడు స్వామి క్షిప్రప్రసాదత్వమును కోరుకొనుచున్నాడు.అదియును నిరంతర దర్శనభాగ్యమును అభిలషిస్తున్నాడు. నిత్యపరమానంద సుఖమును స్వామి వీక్షణము వలన కలుగు పరమానందమును ఆదిశంకరులు కోరుకొనుచున్నారు. హేవిభో-హే పరమేశా! నీ సర్వవ్యాపకత్వమును తెలిస్కొనగలిగిన జ్ఞాననమును,సవమునందు నిన్న దర్శించగల వరమును ప్రసాదించుము. ఈ శ్లోకములో ఆదిశంకరులు స్వామి దర్శన సౌభాగ్యమును వరముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. పూజ అను పదము పునర్జన్మములేకుండా చేయుమని వేడుకొనుటకు సంకేతముగా పెద్దలు భావిస్తారు. ఆదిశంకరులు తాము స్వామిదర్శనమునకు నోచుకోని ఎడల సంభవించే దుఃఖమును భరింపజాలనని కనుక సర్వవేళలందును సన్నిధిలో నుండనిమ్మంటున్నారు. దర్శనాభిలాషను మరింత ప్రస్పుటముచేస్తూ దానికి అవరోధముగా నున్న అహంకారమును తనకు కలుగనీయవద్దన్న దానికి సంకేతముగా బ్రహ్మ హ...

NA RUDROE RUDRAMARCHAYAET-30

Image
 న రుద్రో రుద్రమర్చయేత్-30    *********************  "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై  ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం  బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన  వా  డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరుని, నే శరణంబు వేడెదన్."    బమ్మెర పోతన మహాకవి.(గజేంద్ర మోక్షము)  స్థూలమును గమనిస్తూ,దానిలో దాగిన సూక్ష్మమును   గ్రహించగలుగుటయే   ఈశ్వరానుగ్రహము.                      స్థూలములో తాబేటిని చూస్తుంటే దాని అవయములను కాసేపు ముడుచుకొని,తన డొప్పలో దాచేసుకొని,మరికొంత సేపు బయటకు విస్తరింపచేస్తూ,తాను మాత్రము ఎటువంటి వికారమును పొందకుండా స్థిరముగా నుండు సూక్ష్మ భగవతత్త్వమును అర్థముచేసుకొనగలుట భగవంతుని మీఢుష్టత్వము.    నిక్షిప్త-ప్రక్షిప్త శక్తులను సమయానుకూలముగా వ్యక్తీకరిస్తూ,విశ్వపాలనమును నిర్వహించు పరమాత్మను, నేను శరణము వేడుచున్నాను.  ప్రియ మిత్రులారా!    ఈ కార్తిక మాసమునకు మనము చేయు బిల్వార్చనమునందు "మీఢుష్టమ" అనే పదమును అర్థము చేసుకు...