శ్లో : కరోమి త్వత్-పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వమ్ దిశసి ఖలు తస్యాః ఫలమ్-ఇతి
పునశ్చ త్వాం ద్రష్టుమ్ దివి భువి వహన్ పక్షి -మృగతామ్-
అదృష్ట్వా తత్-ఖేదం కథమ్-ఇహ సహే శన్కర విభో 23
సాధకుడు స్వామి క్షిప్రప్రసాదత్వమును కోరుకొనుచున్నాడు.అదియును నిరంతర దర్శనభాగ్యమును అభిలషిస్తున్నాడు. నిత్యపరమానంద సుఖమును స్వామి వీక్షణము వలన కలుగు పరమానందమును ఆదిశంకరులు కోరుకొనుచున్నారు. హేవిభో-హే పరమేశా! నీ సర్వవ్యాపకత్వమును తెలిస్కొనగలిగిన జ్ఞాననమును,సవమునందు నిన్న దర్శించగల వరమును ప్రసాదించుము. ఈ శ్లోకములో ఆదిశంకరులు స్వామి దర్శన సౌభాగ్యమును వరముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. పూజ అను పదము పునర్జన్మములేకుండా చేయుమని వేడుకొనుటకు సంకేతముగా పెద్దలు భావిస్తారు. ఆదిశంకరులు తాము స్వామిదర్శనమునకు నోచుకోని ఎడల సంభవించే దుఃఖమును భరింపజాలనని కనుక సర్వవేళలందును సన్నిధిలో నుండనిమ్మంటున్నారు. దర్శనాభిలాషను మరింత ప్రస్పుటముచేస్తూ దానికి అవరోధముగా నున్న అహంకారమును తనకు కలుగనీయవద్దన్న దానికి సంకేతముగా బ్రహ్మ హంసనెక్కి ఊర్థ్వముఖముగాను,హరి వరాహమునెక్కి అథో ముఖముగాను పయనించినప్పటికిని నిన్ను దర్శించలేక పోవుటకు అడ్డుగా నిలిచినది వారి అహంకారము ఒక్కటే, కనుక విభో నీ కారుణ్యము నన్నెళ్ళ వేళల నీ ముందుంచును గాక. ఆదిసంకరులు ప్రతి ఉన్నప్పటికిని యుక్తాయుక్తము మరచిన ,మితిమీరి హుంకరించిన అజ్ఞానమును అణిచివేయుము. నన్ను ఆదరింపుము అని పరమేశుని వేడుకొనుచున్నారు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment