Posts

KADAA TVAAM PAsYAEYAM-02

Image
   కదా  త్వాం పశ్యేయం-02    ******************   " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.    నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".   ' స్తవై బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినా     గణానాం కేళీభిర్మదకల మహోక్ష్స్య కకుది"     బ్రహ్మాదులు-నియమపాలితులైనమునులు-పరవస్త్స్తున్న ప్రమథగణములు - అంబా సమేతముగా తనపై నున్న స్వామి అనుగ్రహమును వహిస్తూ నందీశ్వరుడు చేయుచున్న జయ-జయ-జయ-జయ ధ్వానములను మనోఫలకముపై ముద్రించుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.   "జయ జయ జయ పార్వతీ పరమేశ్వరా" నమో నమః.             కొంచము సేపు విశ్రాంతి తీసుకుని మార్గబంధు సహాయముతో పయనము ప్రారంభించారు శంకరయ్య-శివయ్య.   మౌనముగా వారి పాదాలుకదులుతున్నాయి.కాని శంకరయ్య మనసులోని పదాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి.  ఇదేనేమో    "గురోస్తు మౌనంవ్యాఖ్యానం-           శిష్యాస్తు ఛ్చిన్న సంశయా అంటే"    పొరబడుతున్న శంకరయ్య మనసు ప్రత్యర్థి        ...

KADAA TVAAM PASYAEM-01

Image
        కదా త్వాంపశ్యేయం-01    **********************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.    నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".   ప్రపంచ పదార్థములను గుర్తించగలిగి-ప్రకటించకలగటమును ఐహిక జ్ఞానముగాను,అవ్యక్త చైతన్య ఉనికిని గుర్తించి-దర్శించి ధన్యత చెందగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానము.అదిలేనిది అజ్ఞానము.ఒక వస్తువును మరొకటిగా భావించి-భాషించుట అన్యథా జ్ఞానము.అన్యథా జ్ఞానము అజ్ఞానము కన్న అనర్థదాయకమని దానిని తొలగించుకొనుట అతి కష్టమని పెద్దలు అనుభవముతో చెబుతారు.  ఈనాటి బిల్వార్చనము లో సదాశివుడు,     మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు  రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.    అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్టిన తుడుచుకుంటున్నారు.క...

KADAA TVAAM PASYAEM-INTRODUCTION

Image
                    శివస్వరూపులారా!     అగ్ని స్వరూప నక్షత్ర కృత్తికా /కార్తిక మాసమున సత్యము-శివము-సుందరమైన అంబాసమేతముగా ,  "కలాభ్యాం-చూడాలంకృత శశికలాభ్యాం' అంటూ  వచ్చేశాడు.అశేషఫలములను అందిస్తానంటున్న వారిరువురిని అంతఃకరణ శుద్ధితో  ఆహ్వానించేద్దాము.        ' ఐంకార-హ్రీంకార-రహస్య యుక్త     శ్రీంకార-గూఢార్థ-మహా విభూత్యా     ఓంకార-మర్మ-ప్రతిపాదినీభ్యాం     నమో నమః శ్రీ గురుపాదికాభ్యాం"    గుడివైపుగా మెల్లగా నడచి వెళుతున్న సాంబయ్య చెవిని పడింది శ్లోకం చిత్తవృత్తులను చిత్రముగా మలుస్తూ. నేనసలే నాస్తికుడిని.దేవుడే లేడు కదా.నాకెందుకు వాళ్ళేమి చెప్పుకుంటే అంటూ ముందుకు సాగాడు.మనిషి కంటె వేగముగా మనసు ముందుకు సాగుతోంది.అసలు మనసును మభ్యపెట్టి ఆటలాడుచున్న ఆ "టక్కరి" నాకు కనిపించాలేకాని,........పళ్ళునూరుతున్నాడు.   శివుని కరుణ అర్థము కానిది      కాని   శివుని కరుణ అద్భుతమైనది.  " క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం-క్రీడా మృగా...

INTRODUCTION

Image
   ప్రియ మిత్రులారా ,శరత్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.    శ్రీ మాత్రే నమః.  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌః"    పార్వతీ-పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె-పూవు-తావి వలె,శబ్దము-అర్థము వలె నిత్య సంబంధము కలవారు.తన రఘువంశ కావ్యారంభములో వారిని,వాగర్థ ప్రతిపత్తికై/ప్రతిభా-పాటవములకై వాగర్థస్వరూపులైన వారిని నమస్కరించి వరప్రసాదుదైన మహా కవి కాళిదాశుని కనికరించిన తల్లి ,మనలనందరిని కనికరించుచున్నదా యనునట్లు మహాకవిచే మరొక అమృత లహరి/అద్భుత వాగ్ఝరి అయిన 'కాళికా దసశ్లోకి" అను మరొక 13 శ్లోకము అంబాస్తుతిని మానవాళికి అనుగ్రహింపచేసినది.అతివేగముగా అమ్మ వారి అనుగ్రహమును పొందగలిగిన స్తోత్ర రాజము అమ్మవారిక్షిప్రప్రసాద గుణమునునకు ప్రతీకగా "అశ్వధాటీ స్తొత్రముగా" వాసికెక్కినది.వేగముగా పరుగులు తీయుచునంబ ఆడుగుఱ్ఱపు డెక్కల సవ్వడి వంటి శబ్ద వేగముతో,కళ్లకు గంతలు కట్తుకుని అటు-ఇటు చూడని ఏకాగ్రత కు మారుగా,గమ్యమును చేర్చుటకు పూనుకొనిన ఆ జగజ్జనని సాక్షిగా,ఏ మాత్రము అర్హత-అనుభవము -పాండిత్యము లేని ఈ ఉపాధి దుస్సాహసమును చేయుచున్నది. 13 శ్లోక...

KURYAAT KATAKSHAMKALYAANI-13

     ప్రార్థన  ప్రదీప జ్వాలాభిః దివసకర నీరాజన విధిః   సుధాసూతే చంద్రో ఫలజలం వైరర్ఘ్యరచనా  స్వకీయైః అంభోభిః సలిలవిధి సాహిత్యకరనం  త్వదీయాభి@ః వాగ్భిః తవ జననివాచాం స్తుతి రియం.. శ్లోకం   ఇంధాన కీల మణిబంధా భవే హృదయ బంధా వతీవ రసికా   సంధావతీ భువన సంధారణేప్యమృత సింధా వుదార నిలయా   గంధానుభావ ముహురంధాలి పీత కచబంధా సమర్పయతు మే   శం ధామ భానుమపిః ఉంధానం ఆశుపద సంధానః అప్యనుగతా.

KURYAT KATAKSHAM KALYANI-12

   ప్రార్థన     తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం   తమీడే సంవర్తం జననీ మహతీం తాం చ సమయాం   యదాలోకే లోకాన్ దహయతి మహతి క్రోధకలితే   దయార్ద్రా యా దృష్టిః శిశిరం ఉపచారం రచయతి.   శ్లోకము  కూలాతిగామి భయ తూలావళి జ్వలనకీలా నిజస్తుతి విధా  కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాలపోషణనభా  స్థూలాకుచే జలదనీలా,కచే కలిత లీలా కదంబ విపినే  శూలాయుధ ప్రణతి శీలావిభాతు హృది శైలాధిరాజ తనయా.

KURYAT KATAKSHAMKALYANI-11

  ప్రార్థన   కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం     సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం  తవేదం నఃఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం  యదాలోక్యా శంకాకులిత హృదయో హాస జనకః  స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి.  శ్లోకము      యత్రాశయోలగతి తత్రాగజ వసతు కుత్రాపి నిస్తుల శుకా  సుత్రామ కాలముఖసత్రాసకప్రకర సుత్రాణకాలిచరణా  ఛత్రానిలాతిరయ పత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ  కుత్రాసహీన మణి చిత్రాకృతి స్పురిత పుత్రాదిదాన నిపుణా.తాం రంజనమమీ. 1.    స్తోత్ర పూర్వపరిచయము.  *******************  ముగురమ్మలను మూడువిధములుగా స్తుతించి,ముచ్చటగా మూడు వరములను కోరిన మహాకవిని,ఆ" భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షిణి,ఆ" సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాతాలోక పూజ్యుని చేయదలచినదేమో.  కనుకనే మహాకవి ప్రస్తుత శ్లోకములో,చాందోగ్య ఉపనిషత్ మహావాక్యమైన. "తత్-త్వం-అసి" ని బహుచమత్కారముగా మనకు పరిచయము చేస్తున్నారు.  కంకాళ పక్షి విషయే అంటు మన ఉపాధి విషయమును ప్రస్తావించువేళ,ప్రజ్ఞానం బ్రహ్మ అను మొదటి వాక్యమును చెప్పకనే చెప్పినారు.బృందార బృంద ...