Monday, November 13, 2023

KADAA TVAAM PAsYAEYAM-02




   కదా  త్వాం పశ్యేయం-02

   ******************

  " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.


   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".


  ' స్తవై బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినా

    గణానాం కేళీభిర్మదకల మహోక్ష్స్య కకుది"


    బ్రహ్మాదులు-నియమపాలితులైనమునులు-పరవస్త్స్తున్న ప్రమథగణములు - అంబా సమేతముగా తనపై నున్న స్వామి అనుగ్రహమును వహిస్తూ నందీశ్వరుడు చేయుచున్న జయ-జయ-జయ-జయ ధ్వానములను మనోఫలకముపై ముద్రించుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.

  "జయ జయ జయ పార్వతీ పరమేశ్వరా" నమో నమః.


    


     


 కొంచము సేపు విశ్రాంతి తీసుకుని మార్గబంధు సహాయముతో పయనము ప్రారంభించారు శంకరయ్య-శివయ్య.

  మౌనముగా వారి పాదాలుకదులుతున్నాయి.కాని శంకరయ్య మనసులోని పదాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి.

 ఇదేనేమో 

  "గురోస్తు మౌనంవ్యాఖ్యానం-

          శిష్యాస్తు ఛ్చిన్న సంశయా అంటే"


   పొరబడుతున్న శంకరయ్య మనసు ప్రత్యర్థి         వివరాలు           అడగటానికి తడబడుతోంది.కాని ఇప్పుడు శివయ్య మౌనముగా ఉండతలచుకోలేదు.మరలించాలి కదా మనసైన వాడిని తనదారిలోనికి.అసలు తాను వచ్చింది అందుకేగా.


    శంకరయ్యకు శివయ్య తప్ప వాని గురించి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూలేరు.(ఎక్కడున్నకూడా)

 కాని అడగటానికి అహం అడ్దు వస్తోంది.అడ్డగోడ కడుతోంది.శివయ్య కరుణా కెరటము దానిని కూల్చివేస్తున్నది.

 " ఒకవైపు అనుమాన లహరి-మరొకవైపు అనుగ్రహలహరి "      పోటీ      పడుతు ప్రవహిస్తున్నాయి ఇరువురి హృదయాలలో.. "నమః శివాయ"


    అడగటం తప్పేమి కాదులే అనుకున్నాడు శంకరయ్య.

    నీకు తప్పేది కాదులే అనుకున్నాడు శివయ్య.

  ఇరువురు ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు

    అవ్యాజ కరుణతో ఆ మహాదేవుడు ఏమైయింది శంకరయ్య గారు?అడుగుల  వడి తగ్గింది.ఏదో ఆలోచిస్త్లున్నారు...... కొంచము సేపు ఆగి,

  ఇలా అయితే మనము వాడిని చూసేది ఎప్పుడు.గట్టిగా పట్టుకునేది ఎప్పుడు?.మోసాలను అరికట్టేది....

  మీరు నా పక్కనే ఉన్నారన్న ధైర్యముతో నేను మీతో వస్తున్నాను.ఆలస్యమైతే  అందకుండా పారిపోతా..డేమో

  పోనీ వెనుకకు మరలిపోదామా..

  నేను నా తిప్పలు పడతాను.మీకసలు వాడి అవసరమే లేదుకదా.చిలిపిగా చూస్తూ అడిగాడు శివయ్య.

 నీ కా శంక ఎందుకు వచ్చింది శివయ్యా?

 నేను ఆడిన మాటను తప్పి ఓటమిని ఒప్పుకునే వాడను కాదు.నువ్వు నాకొక చిన్న...-చిన్న మాట సహాయంచేస్తే చాలు..మనపని   అయిపోతుంది.  నువ్వు సందేహం పెట్టుకోకు అన్నాడు.

   మాటసాయ0   ఇప్పుడే-ఇక్కడే చేస్తాను   అడగండి     శంకరయ్యగారు అనగానే,వెంటనే

   నువ్వు నీకు ఎవరో అతని గురించిచెబితే నీ కష్టాలు పోగొట్టాలని అడగటానికి వస్తున్నవు కదా,  వాళ్ళు....

 అడగండి శంకరయ్య గారు

 వాళ్ళు వాని ముఠాలో షుమారు ఎంతమంది ఉండవచ్చని చెప్పారు? అడిగేశాడు.

 ఓ అదా...ముప్పది మూడు కోట్ల మంది అంట.

   ఏమిటి అంతమందిని వశపరచుకున్నాడా ఆ ...

  వాళ్లందరు కలిసి ఈ అమాయక జనాలను మోసం చేస్తునా....

   కాదండి.

 వాళ్లందరు ఆయనను సేవిస్తుంటారటండి.ఆయన ఏది చెబితే అది వాళ్ళు చేస్తారట.పైగా 

 "శివ శాసనము-శిలా శాసనము కన్నా గొప్పది" అన్నారండి

  ఒక్కొక మాటతో ఎంచక్కని బాటను వేయడం ప్రారంభించాడు శివయ్య.

  వాడు అమ్మలాంటి అయ్య అట-అయ్యలాంటి అమ్మ అట.

  సరేలే కాని శివయా..

 మిగతా వాళ్ళలో కొందరిపేర్లైన చెప్పారా నీకు? వాళ్ళు అసలు ఏం    చేస్తుంటారట         నాకు తెలీక అడుగుతాను.పనిలేనివాళ్ళు పనికిమాలిని వానిని చేరి---పాపం పాపం-ఉపశమించునుగాక.

 మాచిన్నప్పుడు మా పక్కింటి బామ్మగారు ఎప్పుడు ఇదే పాట పాడేది.నన్ను పాడమంటారా శంకరయ్యగారు.

 ఇప్పుడు వద్దంటే విషయములను సేకరించలేననుకుంటూ వినిపించు త్వరగా అన్నాడు అసహనంగా శంకరయ్య.


 "వస్త్రోద్ధూత విధౌ సహస్ర కరతా,పుష్పార్చబే విష్ణుతా

  గంధే గంధ వహాత్మతాన్నపచే బహిర్ముఖాధ్యక్షతా

  పాత్రే కాంచన గర్భితాస్తి మయిచేత్ బాలేందు చూడామణి

  శుశ్రూషాం కరవాణితే ..........స్వామిః..గురో"

  చిన్నప్పుడు రోజు వినేవాడినికదండీ నోటికి వచ్చేసింది.  ఆవులిస్తూ నాకు నిద్దరవస్తోంది శంకరయ్యగారు రేపు మాట్లాడుకుందాం 


అని అంటున్న శివయ్యను తెల్లబోయి చూస్తున్నాడు శంకరయ్య,

   కదిలేవి కథలు-కదలనిది కరుణ.

  .

 'తన్మై మనః శివ సంకల్పమస్తు


  వాచే మమశివపంచాక్షరస్తు


  మనసే మమ శివభావాత్మ మస్తు".


   కదిలేవికథలు-కదలనిది కరుణ.


    పాహిమాం పరమేశ్వరా.




    (ఏక బిల్వం  శివార్పణం) 


  



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...