కదా త్వాం పశ్యేయం-03
****************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్త్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."
" నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజాశ్రయం
స్వఛ్చం సద్విజసేవితం కలుష హృత్వాసనా నిష్కృతం
శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం స్థిరం" అయిన ఆ పరమేశ్వరుని హృదయఫలకమునందు స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.పాహిమాం పరమేశ్వరా .
తెల్లబోయి చూస్తున్న శంకరయ్యను సమీపించి,ఆయన ఎంతమంది వెంట ఉన్నా ఏమీలేనివాడేనట అన్నాడు.
విన్న శంకరయ్య అంటే బీదవాడా? బిచ్చమెత్తుకుంటాడా? అసలు ఏమిచేస్తుంటాడట?
ఆసక్తిగా అడిగాడు శివయ్యను.
పక్కా బిచ్చగాడు.ఆ విషయము తెలిసికొని ఒకాయన వెళ్ళిచూస్తే అప్పుడే ఒక పుర్రెను పట్టుకుని బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరుతున్నాడట.
ఈయనకేమి లేదు-నాకేమి ఇస్తాడు అనుకుని,ఆకలిగా ఉంటే,నేను నీతో వస్తాను.నీకు గారడేఏలు బాగా వచ్చుకదా.నన్ను కోతినిచేసి నీతో పాటుగా తీసుకువెళ్ళి ఆడిస్తే,దొరికిన భిక్షను ఇద్దరము తినవచ్చు
" కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం" అంటూ బేరాలాడాడట.అదీ విషయం వాళ్ళిద్దరినిచూసిన వాళ్ళే నాతో చెప్పారు.అందుకే కష్టాల మాట అతుంచి కాస్త అతనితో పాటుగా భిక్షకు వెళ్ళి కడుపునింపుకోవచ్చును అనుకుంటున్నా అన్నాడు శంకరయ్య ముఖ కవళికలను గమనిస్తూ.
రెట్టించిన ఉత్సాహముతో శివయ్యా నువ్వు చెబుతున్నదంతా నిజమేనా ....నిజమేనని మరొక్కసారి చెప్పు అన్నాడు.
అయ్యో శంకరయ్య గారు అన్నము ఎచరోప్ర్డతారు.పాపం నీళ్ళుకూడా లేవని ఎవరో భక్తుడు నీళ్ళకుండను నెత్తిమీద పెట్టించాడట.
బట్తలంటూ సూర్యుడు కిరణములను తాకనిస్తాడట.పూలంటూ హరి ఇస్తాడంట.సుగంధములను గాలి తెస్తుందట.యాగాలు చేసి ఆహారం పెడతారట అప్పుడప్పుడు అని అనుకుంటూ మురిసిపోతుంటాడట.
ఎగిరి గంతేసాడు శంకరయ్య.ఓస్ అంతేనా.ఇంకేం.ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాను వాణ్ణీ అంటూ లేచాడు.
ఇంతలో తూనీగలా ఎగురుకుంటూ అక్కడికి ఆడుకోవటానికి వచ్చింది గిరిజ.
శివయ్యను కోపముగా చూస్తూ ఎందుకు అన్నీ అబద్ధాలు చెబుతున్నావు ఆయనకు అంది.అమ్మను రప్పించాడు ఆటను రక్తి కట్టించటానికి.అలవోకగా అమ్మను చూస్తూ,
నేను చెప్పేవి అబద్ధాలు అయితే నిజమేదో నువ్వేచెప్పు.నేనూవింటాను అన్నాడు అల్లరిగా.
ఆయన ఎక్కడౌంటాడో తెలుసా...లేదన్నాడు శంకరయ్య.
'కదా వా కైలాసే కనకమణి సౌధే-" అంటూ
బంగారు మేడలో కైలాసములో ఉంటాడు.చుట్టు ఎంతోమంది సేవలుచేస్తుంటారు.
అయోమయంలోపడ్దాడు శంకరయ్య.చిన్నపిల్ల అబద్ధము ఆడదు.కాని శివయ్య బిక్షువు అంటున్నాడు.
ఒకవైపు పరీక్షా లహరి-మరొక వైపు ప్రసాద లహరి పోటీ పడుతు ప్రవహిస్తున్నాయి.
అంతలో శివయ్య ఇ పాపకు ఏమీ తెలియదు.ఏదో చెబుతోంది.మొన్ననే మాకు తెలిసిన ఆయన
" నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశ అంటూ పాడుతూ బిచ్చమెత్తుకుంటున్నాడు.ఏంపాటరా బాబు అని అడగగానే శివయ్య గురించి పాడుతున్నాలే అన్నాడు.
ఆటను మధ్యలో మళ్ళీ వచ్చింది గిరిజ.
ఏమయ్యాశివయ్యా.ఎవరు బిచ్చగాడు?ఎవరు ఇచ్చేవాడు?కొంచము చెప్పు..గద్దించింది.
అయినా నీకేం తెలుసని చెబుతావులే.
నా మాట నమ్ము శంకరయ్యా.
ఆయన ఇంటి తలుపు దగ్గర కుబేరుడు అదే డబ్బులు కురిపిస్తూ ఉంటాడు.కల్పవృక్షం-కామధేనువు-చింతామణి కూడా ఉంటాయి.
కరస్తే హేమాద్రే-చేతిలో బంగారం
సరిగ్గా చూడండి అంటున్నది.
శివయ్యేమో బిచ్చగాడు అంటున్నాడు
గిరిజ ఏమో కానేకాడంటోంది.
ఏది సత్యం-ఏది అసత్యం
తలపుల లహరులలో మునకలు వేస్తూ గిరిజను చూస్తూ,
తలను పంకించాడు తడబడుతూ.
కదిలేవికథలు-కదిలిస్తున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment