Tuesday, July 4, 2017

PELLI PUSTAKAMU


     పెళ్ళి పుస్తకము
    ***************

  "ధర్మేచ-అర్థేచ-కామేచ
"
   నాతిచరామి అని కన్యాదాత  
  నాతి  చరితవ్యామి   అని వరుడు పలుకు

  వివాహ బంధము అనే వేద గ్రంథములో

  వధూవరులుగా మొదటి పుటలోను
  నవ దంపతులుగా  రెండవ పుటలోను
  ఆలు-మగలుగా  మూడవ పుటలోను
  అమ్మ-నాన్నలుగా  నాల్గవ పుటలోను
  అత్త-మామలుగా ఐదవ పుటలోను
  అవ్వ-తాతలుగా ఆరవ పుటలోను
  షష్టిపూర్తి రూపం లో ఏడవ పుటలోను
  తదుపరి ప్రతిపూట తన్మయపు మూటలుగా

  పారదర్శికత కలిగిన దార్శనికతో
  ఒకే ఆస మీదిగా-ఒకే శ్వాస మీదిగా
  ఒకే మాట పలుకుతూ-ఒకే బాట సాగుతూ

 "సం" పదమంటు   కదిలే "సం" సార రథ చక్రాలుగా
  ఒకరికొకరు  తోడుగా  ఒద్దికైన వేళ

 " సప్త పది" పయనము సకలాభీష్టములనిచ్చుగాక
   ముక్కోటి దేవతల దీవెనలు చక్కని పూబాట అగుగాక

  బంధుమిత్ర అభినందన సుగంధములు చల్లుగాక
  "గట్టి మేళము" ఎపుడు మీ చేయి పెట్టి నడుపు గాక

  " అర్థనారీశ్వరమై"  మీరు వర్ధిల్లెదరు గాక.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...