జెఫర్సన్ పార్కు
**************
అందరికేమో అది ఆనందసుందరము
అందమైన మదికేమో అధ్యయనమందిరము
అందరిని అందముగ ఆదరించు మేదిని అది
ఎందరికో శాంతముగ మోదమిచ్చు బాపూజి అది
అతివల వలపునుదోచే అమ్మ ఒడి ఆ బడి
గతుకుల తలపులుతోలే కమ్మనిగుడి ఆ ఒడి
కన్నపిల్లల చిన్నచిన పొరపాటును కనపడనీయదచట
తల్లడిల్లు తల్లితండ్రుల తడబాటును వినపడనీయదెచట
సఫరింగుని తొలగించే థామస్ జెఫర్సన్ పార్కు
ముఫత్గా తగిలించా నేనొక తారీఫ్ రిమార్కు
వస్తూనే అనుకున్నా నాకంతా తెలుసునని
చూస్తూనే తెలుసుకున్నా నాకేమి తెలియదని
చేస్తున్నా ప్రయత్నాన్ని అందరిని కలుసుకొని
వ్రాస్తున్నా అనుకొన్నది నీ విలువ తెలుసుకొని
బుధవారంనాడు తననుతెంచి మనసు తుంచినా
మంగళవారం నాటి వరకు మదిని ఆశతో పెంచుతుంది
పెనుతుఫాను సైతం నిను పెకలించలేదుకదా
గడ్డితల్లి చెబుతుంది గడ్డుసమస్యలకు అర్థం
తలవంచక తెలివితోడా మెలగుటకద పరమార్థం నా
గుడ్డితనము తొలగించిన గడ్డితల్లీ; నీ ముందు నేనెంత?
గాలమునకు పడనీయక జాలరినుండి దాచిపెట్టి
చేపతల్లికి తానే ప్రాపై బ్రోచినట్టి
నీటితల్లి చెబుతుంది పరోపకార పరమార్థం
దప్పితీర్చి,ముప్పు తీర్చు ఓ నీటితల్లీ
నీ సహాయనిరతిముందు నేనెంత?
ఆదమరువ సేదతీర్చి,మా ఊరిని మరపించి
భేదములతోపాటు మా ఖేదములను తొలగించి
మాకు ఊరట కలిగించే ,మమ్మెంతో మురిపించే
గారపు ప్రియ నేస్తమా ,నీ ప్రస్తుత
సేవానిరతిముందు నేనెంత?
తోచినపుడు,తోచనపుడు,తోచితోచనపుడు
తెగిడినా,పొగిడినా సాగనీ నీ పయనాన్ని
తెలివిగా మిగిలుతూ మిగలనీ నీ వినయాన్ని
అని, మా బాధలు విని బోధచేయు నీ
మేధ ముందు నేనెంత?
గురుదక్షిణగా నేను గురుతెరిగి మసలుకొంటా
పొగరుతనమును నేను చిగురునుండి తుంచుకుంటా
పలువురితో మంచితనము పదిలముగా పంచుకుంటా
నలుగురు మెచ్చే దారిలో నా నడకను సాగించుకుంటా
వాడవాడనుండి వచ్చి గోడుచెప్పువారికి
తోడునీడగా ఉండి వారి మూడు మార్చుచు
నీడవోలె మమ్మంటిన నీ మధురస్మృతులు
తోడురాగ వీడలేక అడుగుతున్నా
మాకిస్తావా సెలవిక.
No comments:
Post a Comment