కేరళ కేరింతలు-4
వెనుకకు తిరుగు సరస్సుజలాల బలమేమో,మనసు వెనుకకు వెనుకకు పరుగిడుతుంటే దానిని బంధించుటకు బుద్ధి బయలుదేరింది.వెంటనే..నేను ఇక్కడకు ఎలా రాగలిగాను?అవధులులేని నా ఆనందానికి కారకులెవరు?కళకళల కేరళ తలుపు తాళాన్ని నాకోసం తీసిందెవరు? అద్భుత ఆనందాల పల్లకీలో నేను కూర్చుంటే మోసిన బోయీలెవరు?మాకు కనువిప్పును కలిగించి మా అందరిమెప్పును శాలువగా కప్పుకున్న మేధావులెవరు?నాలో ప్రశ్నల పరంపరలు
జవాబులను వెతికి...తల్లితండ్రులకు అద్భుత అనుభూతులనిచ్చిన వారిని(మనసులోనైన)మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.వారికి వేయింతల ఆనందం కలగాలని...అది
పుత్రొత్సాహమో,పౌత్రోత్సాహమో,నిత్యోత్సాహము కావాలని భగవంతుని ప్రార్థించాను.మనవరాళ్ళు,మనవడు అడుగడుగునా కనిపెట్టుకుని కంటిపాపలా చూసుకుంటేనే కదా ఇదిసాధ్యం.వియ్యమునొందిన నెయ్యము ఆత్మబంధువై కొత్త ఇంధనమును ఇస్తేనే గదా
నేను కేరళ సౌధమున(సుధలుగలది)విహారముగావించినది.మందులే విందైన నాముందు అందాలసందడి చేయించిన ప్రతివారికి(వయసులో చిన్న-మనసులో మిన్న)మనసా,వచసా,శిరసా అంజలిస్తూ,మధురానుభూతులను మధించి,వ్యయ ప్రయాసలకు ఓర్చి మమ్మానందింప చేసిన ప్రతి ఒక్కరికి ,ఇంతై,ఇంతింతై,ఎంతెంతోగా ఆనందాలు చేరాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ......కొండంత చూసి గోరంత తెలిపిన
భవదీయురాలు.

No comments:
Post a Comment