ప్రాజ్ఙ్నన్నయ యుగము నుండి
ప్రస్తుత సమయము వరకు
పథకాలు తెలుగేనట
పతకాలు తెలుగుకేనట
తెలిమంచు తెరలనుండి
మలిసంజె గుంకు వరకు
పెదవంచున తెలుగేనట
నయవంచన తెలుగుకేనట
గుంజలు పాతుట నుండి
గురిగింజలు మాటలతో
పందిళ్ళు తెలుగేనట
సందళ్ళు తెలుగుకేనట
పోకడలు తెలియువరకు
లోకులు నమ్మే వరకు
మైకులలో తెలుగేనట
పైకము తెలుగునకేనట
జ్యోతి ప్రజ్వలనము నుండి
భరత వాక్యము వరకు
ప్రసంగములు తెలుగేనట
ప్రచారము తెలుగుకేనట
నోరు మాట్లాడుతుంటే
నొసల వెక్కిరింపులేనట
యాసలలో తెలుగేనట
ఆశలన్ని తెలుగుభాషకేనట
కూసింతైన వినబడని తెలుగు ఊసు
అమ్మతో చెప్పింది నమ్మరాని పలుకులని.
No comments:
Post a Comment