చిదానందరూపా-ఎనాది నాధ నాయనారు-27
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
"ఎనాది" ఖడ్గవిద్యా గురువు,భర్గుని నమ్మిన భక్తుడు
శివభక్తుల పాలిట ఎప్పుడు తానొక కల్పతరువు
ఫాల విబూదిరేఖలను చూసి పరమేశునిగానే తలుచు
ప్రాణము విడుచుటకైనను వెనుకాడక ముందర నిలుచు
ఈశుని లీలయనంగ అతిసూరను అడిగెను పోటి
ఈసును తెలియని శౌర్యము వివరించెను లేరని సాటి
శివభక్తుని వేషపు సాయము శిరమును దునుమాడినదిగా
విశ్వేశ్వర సన్నిధిచేరగ విభూతి కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment