Saturday, October 7, 2017

CHIDAANAMDAROOPAA-SOMASI MAARA NAAYANAARU

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ |
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ
 చిదానందరూపా-సోమసి నాయనారు-28

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు
 తిరువెంబూరులోని  శివభక్తుడు సోమసి మార నాయనారు

 పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు
 పరహితమును కోరు అనిశమును పూజను  మానడు

 గురువని తలచెను సుందరారును,తిరువూరును  చేరెను
 భుజియింపగ  యాగ హవిస్సును శివునే కోరెను

 చండిక తోడుగ శివుడు చండాలుడిగ  వచ్చెగా
 సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయ్  శివోహం జపంబు చింతలు తీర్చును గాక

 ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన  పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు.

  తిరువాంబూరులోని సోమశిర నాయనారు ఉత్తమ సంస్కారుడు.పరమ శివభక్తుడు

 త్రిగుణములతో. 

 త్రినేత్రుని పొందినవాడు. అవి,1.బ్రాహ్మణులు అగ్రకులజులమను అపోహలో నున్న సమయమునందు  కుల వివక్షను మరచి సర్వజనులను సదాశివుడే అనుకొనుచు,శివభక్తులను  త్రికరణ శుద్ధిగ కొలిచేవాడు.

2. యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా  జరుగుపవిత్ర  అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం  యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేది యజ్ఞంలో ముఖ్యమైన  అంశము. ఎటువంటి ఫలితములను ఆశించక నిస్స్వార్థముగా చేయు యజ్ఞమును శివపూజగా  భావించి,సంతృప్తితో నుండెడివాడు.

3.గురువుగారైన  సుందర మూర్తి యందు అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను  కలిగియుండెడి వాడు.గురుసేవకై తిరువూరు చేరిన సోమశిర  నాయనారును పరీక్షించాలనుకున్నాడు.యాగ హవిస్సును స్వీకరించమని ప్రార్థించు  సోమశిర ను పరీక్షించుటకై పంచమ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.పరమానందముతో వారిని సేవించి,పులకించాడు నాయనారు.సమయము ఆసన్నమైనపుడు సద్గతి కలుగుతుందని దీవించి,అదృశ్యమయ్యారు ఆదిదంపతులు.అతిపవిత్ర మనసుతో అనుగ్రహించిన ఆదిదేవుని నిర్హేతుక కృపా కటాక్షము మనలందరిని అనుగ్రహించుగాక.

  ( ఏక బిల్వం  శివార్పణం.)
.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-14

      తనోతు నః శివః శివం-14    ********************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పారవతీ పరమేశ్వరౌ"...