Saturday, October 7, 2017

CHIDAANAMDAROOPAA-CHAERAMAN PERUMAL NAAYANAARU


 చిదానందరూపా-చేరమాను నాయనారు-29

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను  వీతరాగుడు
 తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు

 పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె
 పశుపక్ష్యాదులు సైతము  ప్రశాంతముగ పరవశించె

 రతిపతిని కాల్చినవానిని రాజు  రజకునిలోన గాంచె
 విశ్వేశ్వరుడీతడేనని  వినయ నమస్కారమును  గావించె

 తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ
 తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

 చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివ నిఎదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గోల్ పోరయాను తపోదీక్షను కోరి రాజ్యమును విడిచివేసెను.వారసులు లేనందునప్రజలు మన నాయనారును వేడుకొనగా శివాజ్ఞగాభావించిస్వీకరించి సుభిక్షముగా నుండునట్లు పరిపాలించుచుండెను.



   చేరమాను శ్రద్ధాభక్తులకు మెచ్చి సుందరేశుడు తనశిష్యుడు బాణాపతిరారు ద్వారా ఆశీస్సులను పంపాడు.మనో వాక్కాయ కర్మలను నటరాజార్పణము చేసిన నాయనారును కనకసభనుండి తన మువ్వల సవ్వడితో ఆశీర్వదించెడివాడు.ఒకరోజు మువ్వల సవ్వడి వినిపించలేదు.స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు నంబి  అరూరారు సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు.

    తనలో లీనముచేసుకోవాలనుకొన్నాడు.దానికి లీలగా సుందరారుని పిలిచి,చేరమాను సుందరారును అనుసరించునట్లు చేసి కైలాసమునకు రప్పించాడు కాని దేవుడు వరమిచ్చినా పూజారి కూడా ఇవ్వాలి అన్నట్లు నందీశ్వరుడు నాయనారును అడ్డుకున్నాడు.వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వుంటేనేమి అన్నట్లు పరమేశ్వరుడు తన వాహనమైన నందికేశ్వరుని పంపి తనదగ్గరకు పిలిపించుకొని లాలించినట్లు మనలందరిని లాలించుగాక.

   ( ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...