చిదానందరూపా-పశుపతి నాయనారు-30
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పశుపతి రుద్ర నాయనారు పుట్టెను తిరువరియూరునందు
పురుతశి నక్షత్రంబున గురుతర పూజలనందు
కంఠములోతు నీటను అకుంఠిత భక్తిని కొలుచువాడు
ఉత్కంఠత నిండగ నమక-చమకములను పలికెడివాడు
నమ్మిన భక్తిమార్గమున మూడు సంధ్యలను వందనములిడు
కమ్మని స్తవములు తెమ్మెరలై ముక్కంటి ముంగిటనుండు
లాలనచేయగ దలచి పశుపతి, పశుపతిని పిలిచెగ
నీలకంఠుని పొందగ కంఠపులోతు నీరు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియ శివః-అని ఆర్యోక్తి.సాక్షాత్ జల లింగమైన జంబుకేశ్వరునకు అభిషేకములు అవసరమా? ఆయన చల్లదనమునకువచ్చినలోటేమిటి?మంచు
కూసిని నీళ్ళు పోస్తే ఖుష్ అవుతాడట శబ్బాషు శంకరుడు.(శ్రీ తనికెళ్ళ్ భరణి గారు.)తొండము నిండా నీళ్ళు నింపి ఆది-అంతము లేని ఆ శివునికరుణను పొందినది దంతి.చెంబును దొంగిలించుటకుచెంబులోని నీటిని అప్రయత్నముగా లింగముపై పోసినందులకు చేరినాడు దొంగ ఆ జంగమదేవరను.త్రి సంధ్యావందనములను చేసిన ఆ పశుపతిని ,తనలోని పశుపతికి నీటిని అందించినవానిని పాశ విముక్తుని చేసిన స్వామి మన సంసార పాశములను తొలగించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment