చిదానందరూపా-హరలయ్య-కళ్యాణమ్మ
********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కళ్యాణ నగరములోని లింగాయతనులు హరలయ్య-కళ్యాణమ్మ
చెప్పులు కుట్టుచు భుక్తికి చెదరనిభక్తితో నుండువారు
బసవడు వారికడ బసచేయుట గుసగుసలాయెగ
గురువుకు శరణము చెప్పిన శరణార్థికి శరణని పలికెగ
తమవంతుగ తొడచర్మములతో శివునకు చెప్పులు కుట్టిరి
కను ఇంపగు చెప్పులు మంత్రిని శివభక్తునిగా మార్చినవి
హరలయ్య-కళ్యాణమ్మ హర్షముతో హరునే చేరగ
శరణపు ఘోష వారి భవతరణమునకు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
కళ్యాణ నగరములో హరలప్ప-కళ్యణమ్మ పుణ్యదంపతులు.చెప్పులు కుట్టి జీవము సాగించుచు,శివ ధ్యానముతో గడిపెడివారు.వారి పవిత్రతను గుర్తించి,ఒక్సారి బసవడు వారి గృహమున దేవతార్చన చేసి,ప్రసాదమును స్వీకరించెను.చాందసులు దీనిని ఖండించిరి.గురుభక్తి సూచకముగా తమ చర్మమును ఒలిచి చెప్పులు కుట్టి,భక్తితో సమర్పించుటకు వెళ్ళు చుండగా బిజ్జల్దేవుని మంత్రియైన మధువరస తనకు కావలెనని బలవంతముగా తీసుకొని,ధరించన తరువాత శివలీలగా కుష్ఠువ్యాధి పీడితుడాయెను.కరుణాంతరంగుడైన శివుడు పరిచారిక ద్వారా అభిషేక జలముతో వ్యాధిని నయముచేసెను.సంతసించినమంత్రి ఇష్టలింగ దీక్షను స్వీకరించెను.మానవ సంబంధములనుసుస్థిరముచేయుచు వియ్యంకులైనవారిని పరమ ప్రీతితో పరమేశ్వరుడు పవిత్రులను చేసెను.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment