చిదానందరూపా- కిన్నరి బ్రహ్మయ్య
*****************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కిన్నరి మీటుతు పరవశించు త్రిపురాంతక భక్తుడు బ్రహ్మయ
శివ చర్చలసార మరందమందుకొన అట చేరును బసవయ
త్రిపురాంతక సేవలో నున్నవేళ ఆతనిని శరణన్నది ఒక చిన్నిగొర్రె
ప్రత్యర్థికి గొర్రెకు బదులుగ వేయి మాడల పరిహారము నీయగ
కాదని గొర్రెకై బ్రహ్మయను వధింపగ పూనుకొనియె
శరణాగత రక్షణ చేయగ శత్రువు శిరమును తీసివేసె
న్యాయము చేయగ విచారణ జరుపు సమయమున
సాయపు సాక్ష్యము శివుడు చెప్పుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment