చిదానందరూపా-రుద్ర పశుపతి
*************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివ నామమె శ్వాసగ నుండెడివాడు రుద్రపశుపతి
ఏకాగ్రతతో వినుచుండెడివాడు శివపురాణము
ఆ దినమున పురాణప్రవచనము క్షీరసాగర మథనము
ఆదిదేవుని కంఠమునలంకరించినది హాలాహలము
అది వినగానే హతాశుడై స్వామి ఆపద ఆపెడువారు కానగరారు
వారించరు,లోపలి విషమును ఉమ్మమని చెప్పెడివారు లేరు
స్వాంతననీయగ భక్తునికి గరళవీక్షణ సేవను అప్పగించెగ
చెంతన నుండి చూచుటకు స్వామి చింతనయె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment