సౌందర్య లహరి-04
పరమపావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
రతీదేవి కొలిచిన నీ పాదరేణు అనుగ్రహము
రూపులేని మన్మథుని చూపగలుగు పరాక్రమము
నిండు చందమామ పదిగ ఒదిగియుండు పాదము
హరి-బ్రహ్మాదులకు అపురూప సన్నిధానము
క్రిందికి వంగిన వారి కిరీటకాంతులను మించి
ప్రకాశించు పరమేశ్వరి పాదములను మోహించి
పరవశమున నీ పాదమును తాకగ వంగిన ఆ
పరమ శివుని శిరసు గంగ పాద్యము అగుచున్న
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
"గూఢ గుల్భ కూర్మ ప్రుష్టా-జయిష్టు ప్రపదాన్వితా"
నా మానసమందిరములో అధిష్టించిన తల్లీ ,నీ దయచే రతీదేవి తన భర్తయైన మన్మథుని పొందగలిగినది.నీ పాదధూళిని స్పృశించి నమస్కరించుచున్న దేవతల కిరీటకా0తులతో ప్రకాశించుచున్న నీ పాద అసమాన సౌందర్యమును చూసి(అవ్యాజ కరుణ) సంతసించిన పరమేశుడు నీ పాదమును తాకగ క్రిందకు వంగిన ,శిరసిగంగ సింగారముగా వంగి నీకు పాద్యముగా మారి పరవశించుచున్న సమయమున,నీ చెంతనే నున్న, నా చేతిని విడనాడకమ్మా.నమస్కారములు.

No comments:
Post a Comment