సౌందర్య లహరి-06
పరమపావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
రెప్పలేని సోగకనులు గొప్పే అను మీనములు
తప్పు తెలిసికొని దాగెను చూసి నీ నయనములు
మా సరిలేరను కలువలు నీ చలువదనమును చూసి
రాతిరి పూయగ సాగెను ఎవ్వరు చూడరులె అనుచు
అమ్మకు తమపై అసలుందదని అనురక్తి
అతిశయోక్తి నేరుగా చేరిపోయె స్వభావోక్తి
కుత్తుక లోతు ప్రేమతో మమ్ము హత్తుకున్న లత్తుకతో
మా పాపము ప్రక్షాళనమై పాద నమస్కారమైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" తవ చరణం మమ శరణం"
రెప్పవేయని తమ నయనములు సుందరాంగుల నయనములకు ఉపమానములని అతిశయించు చేపలు,అమ్మ కనులుచూసి అసలు నిజము తెలిసికొన్నవి.కలువలు కూడ అమ్మకనుల చల్లదనముతో తాము సరికావని గ్రహించినవి.పాదనమస్కారము చేయుచున్న భక్తులను అమ్మ తన పాదముల మెరయుచున్న లత్తుకతో (పారాణితో) అనుగ్రహించుచున్నవేళ, చెంతనే నున్న నా చేతిని విడనాడకమ్మా.అనేక నమస్కారములు.

No comments:
Post a Comment