తిరిపమెత్తు వాడవని నిరుపేద శ్రీనాథుడు
గల గల ప్రవహించనీయవని గడుసువాడవని గంగ
చర చర పాకనీయవని చతురుడవని పాము
పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి
కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
గంతులేయనీయవని వంతపాడు చంద్రుడు
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలము
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు అసలు ఆలయమున ఊంటాడా? అంటూ
మేమెంతో గొప్పవారిమని వంతులవారీగా
నీ చెంతనే ఉంటూనే కాని చింతలు చేస్తుంటే,వారి
పక్కదారి మార్చవేరా ఓ తిక్క శంకరా.
..............
శివా..గంగ,పాము,లేడి,విషము,చం ద్రుడు,పుర్రె,ఎద్దు శ్రీనాఠుడు అను కవి తామెంతో గొప్పవారమని నీవు వారిని నిర్బంధించావని,లయకారుడు ఆలయములలో ఉండడని నింద
.అవి అలా శివుని దగ్గర ఉండగలుగుట శివుని దయ.శివుడు భక్తుల గుండెలనే ఆలయములో నివసిస్తాడు అని
స్తుతి.
No comments:
Post a Comment