ఎంగిలి జలములతో నీకు అభిషేకము చేయలేను
ఎంగిలి పడ్డ పూలతో నీకు అర్చనలు చేయలేను
ఎంగిలున్న నోటితో ఏ మంత్రములు చదువలేను
సుగంధిపుష్ఠికర్తకు ఏ పరిమళము అందీయగలను
జ్యోతిర్లింగమునకు ఏ నీరాజనమును అందీయగలను
నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా
నైవేద్యానంతర సేవలు నా శివునికి చేయాలిగా
కాదనక కనికరించి కొనసాగనీయని పూజను
నిన్ను ధ్యానించమనిన తన పని కాదంటుంది
నిలకడగ ఉండమంటే అటు ఇటు పరుగిడుతుంది
బుద్ధి లేక ఉంటుంది,హద్దు మీరుతుంటుంది,నా
తైతక్కల మనసు నీది ఓ తిక్క శంకరా.
.............................. .............................. .............................. .............................. .............................. .............................. .................శివుడు ఎంగిలి వస్తువులతో చేయబడిన పూజలు స్వీకరించే దేవుడు కనుక కుదురులేని పిచ్చి మనసు నైవేద్యము చాలని నింద
భావమునేగానిబాహ్యమును చూడని పరమ శివునికి ఆత్మార్పణమును మించిన నైవేద్యము లేదని స్తుతి..
ఏక బిల్వం శివార్పణం
No comments:
Post a Comment