సౌందర్య లహరి-48
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగ ఆబ్రహ్మదేవుడుండగ
పాము చుట్ట విప్పుకొని కొంచము పైకి పాకుతు
పాము చుట్ట విప్పుకొని కొంచము పైకి పాకుతు
పంచభూతములలోని జలతత్త్వముతో
పంచాక్షరి నామములోని "మ" అక్షరము నీవై
పంచాక్షరి నామములోని "మ" అక్షరము నీవై
ప-భ-మ-య-ర-ల అను అక్షరములు ఆరింటిని
ఆరు దళములు గళ పద్మములో ప్రకటించుచు
ఆరు దళములు గళ పద్మములో ప్రకటించుచు
జాగృతమొనరించుచున్న క్రియాశక్తి రూపముగా
స్వాధిష్ఠాన చక్రములో నిన్నుచూచుచున్న వేళ
స్వాధిష్ఠాన చక్రములో నిన్నుచూచుచున్న వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
స్వాధిష్ఠానచక్రము మూలాధార చక్రమునకు మూడు సెంటిమీటర్ల పైన, ఆరు దళములు గల పద్మముగా,లేత ఎరుపు రంగులోనుండును.ఇందులో జాగృతమైన మన చెడు భావనలు కుండలినీ శక్తిని మణిపుర చక్రమువద్దకు పోనీయక అడ్డుపడుచుండును.ఫలితముగా ఒక్కొక్కసారి కుండలిని అథోముఖమై మూలాధారమును చేరవలసి వస్తుంది.స్వాధిష్ఠాన చక్రము యొక్క చిహ్నము మొసలి.మరల మరల కార్య సిద్ధికి ప్రయత్నముచేసే స్వభావములేనిది.అలసత్వముతో (సోమరిగ) నుండును.రుచిని తెలుపుటకు-పునరుత్పత్తికి సహాయపడుచున్న స్వాధిష్ఠాన చక్రములో (అమ్మ దయతో) సూక్ష్మ రూపమున శ్రీమాతను గుర్తించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.
No comments:
Post a Comment