Saturday, April 14, 2018

SAUNDARYA LAHARI-92


 సౌందర్య లహరి-వైష్ణోదేవి

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 మహాశక్తి వెలిసినది ఊర్థ్వభాగపు శిలగా
 ముగురమ్మలు నెలకొనిరి అథోభాగ శిలగా

 ఏనుగు దంతాకారము  లక్ష్మీ సంకేతము
 త్రిజగములబ్రోచుతల్లి  త్రికూటాచలము

 హంసవిల్లి-బాణగంగ-పాదుకాతీర్థములు-
 ఆదికుమారి-కోల్ కండోలి మా-సేవా పరమార్థములు

 మాయాసతి శిరోభాగము మహిమాన్విత జ్వలనముగా
 వైష్ణవీదేవి  కరుణ మనలను పిలుచుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

 " అధాత: సంప్రవక్ష్యామి కుమారీ కవచం శుభం
    త్రైలోక్య మంగళం నామ మహాపాతక నాశనం."

    శ్రీధరుని కరుణించిన కౌమారిదేవి అతనికి దర్శనమిచ్చి,అన్న సంతర్పణమును చేయమని కోరినది.పేదరికముతో స్నేహముచేయు అతడు అమ్మ మాటలకు విస్తుపోయి,తల్లి
ఆనను శిరసావహించి,అన్న సంతర్పణకు ఊరిజనమునందరిని ఆహ్వానించి,ధ్యానమగ్నుడాయెను.అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.భావనా మాత్రముచేతనే బహుపదార్థములు ప్రత్యక్షమాయెను.పంక్తి భోజనమును కౌమారి మాతృప్రేమతో మమతలుపంచుచు వడ్డించుచున్న సమయమున,దురహంకారియైన భైరవుడనువాడు అమ్మను మద్య-మాంసములను తినుటకు వడ్డించ మనెను.వీలుకాదనిన అమ్మపై వాడు ఆగ్రహించి,బంధించుటకు ప్రయత్నించిన మార్గమే,ఆట-పాటలతో అలుపన్నది తెలియక భక్తులు చేయు వైష్ణవీదేవి ఆధ్యాత్మిక అద్భుత యాత్ర.

  అమ్మ తొలిమజిలీ హంసవిల్లి గ్రామము.ఇక్కద దేవామాయి మందిరము ఉంది.శ్రీగురుడనే భక్తునికి అమ్మవారు బాలెంతగా దర్శనమిచ్చినదని,కై ఖండోబా మాత అని కూడ కొలుస్తారు.అక్కద అంతర్ధానమయిన తల్లి అనేక మజిలీలు చేస్తున్నప్పుడు అమ్మను అనుసరిస్తున్న నరులకు/వానరులకు దాహమేసి,డస్సిపోయిన తరుణమున అమ్మ  బాణమేసి జలను అందించినదట.దీనిని "బాణగంగ" అంటారు.అమ్మ తన కేశములతో ఈ జలమును పవిత్రము చేసినదని "బాల్ గంగ" అని పిలుస్తారు.ఉత్తరాది వాడుక భాషలో బాల్ అంటే కేశములు/శిరోజములు అని అర్థము.శిరోజానుగ్రమును పొందిన గంగ కనుక శిరోజ తీర్థము అని కూడా అంటారట.    భైరవుడు తనను ఇంకా వెంబడిస్తున్నాదేమో నని అమ్మ ఒకనిముసము వెనుతిరిగి చూసినదట.ఆ సమయములో అమ్మపాదుకలు భక్తులను ఆశీర్వదించుటకు అక్కడే నిలిచిపోయాయట.అందుకే ఆ స్థలము చరణ పాదుకా తీర్థమని కొలుస్తారు.
  కాలస్వరూపమైన కౌమారి తన లీలగ అక్కడ గుహలో తొమ్మిదినెలలు గర్భస్థశిశువు మాదిరి దాగి బయటకు వచ్చినదట.
 లీలారూపిణి కొంతముందుకుసాగి జ్యోతి స్వరూపిణియై, ,అవలీలగ

 భైరవునకు ముక్తిని ప్రసాదించిన తల్లి తన మందిరమునకు నన్ను రప్పించుకొనిన సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...