సౌందర్య లహరి-సరస్వతీదేవి
పరమపాబనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అమృత- ఆకర్షిణి-ఇంద్రాణి-ఈశాని-ఉషకేశాది
పదహారు అక్షరములు విశుద్ధ పద్మ రేకులు
తక్కిన అక్షరములు వివిధ చక్రములలో రేకులు
హ్రస్వ-దీర్ఘ-ప్లుతములు,ఉదాత్త-అనుదాత్త స్వరములు
నాసిక-నిరనునాసిక విధానముతో పద్దెనిమిది భాగములు
సంగీత స్వర ప్రస్థానములు,సారస్వత రూపములు
మాయాసతి కుడిచేయి మారినది శైవీముఖముగా
సర్వజ్ఞ పీఠ సరస్వతి సాహిత్యరూపమైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
" జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ"
" కశ్మీరేతు సరస్వతి". క శబ్దము శిరస్సును సూచిస్తుంది.కశ్మీరము జ్ఞానప్రధాన కేంద్రము.ఇక్కడిది సర్వజ్ఞపీఠము. ఏ ప్రదేశమునుండి పండితులు ఇక్కడకు వచ్చి విజయము సాధిస్తారో ఆ వైపు ద్వారము తెరువబడేదట. ఆదిశంకరులు తమ ప్రతిభచే అప్పటివరకు తెరువని దక్షిణ ద్వారమును తెరిచారట.కశ్మీరమును శైవీ ముఖము అనికూడా అందురు.శివ జ్ఞానమును శైవీముఖము అందురు.ఇక్కడ జ్ఞాన విచారణకు ప్రాధాన్యతగలదు.
" అక్షరాభ్యాసములోనే" యోగశక్తి నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు." అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు
..

No comments:
Post a Comment