Saturday, April 21, 2018

SAUNDARYA LAHARI-RAJATA PRAAKAARAMU

 పరమపావనమైన నీపాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఆహ్లాదకరము అత్యంత  సుమనోహరము
 ఆరోగ్యప్రదానము మణిద్వీప ఆరవ ప్రాకారము

 ఆశ్వయుజ -కార్తిక మాసములు ,సహశ్రీ-సహస్యశ్రీ
 అందమైన నాయికలు,శరదృతువు  నాయకుడు

 పరిమళసంభరిత ప్రకాశములు పారిజాత వాటికలు
 రససిద్ధిలో తేలియాడుచున్నారు ఎందరో సిద్ధులు

 పండువెన్నెలగా తల్లి కరుణ పిండారబోసిన
 వెండి ప్రాకారములో నేను వెండి-వెండి మురియు వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా


 మానస విహారి ! ఓ సౌందర్య లహరి. 

" శాంకరి-శ్రీకరి-సాధ్వి-శరత్ చంద్ర నిభాననా" అని శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రము కీర్తించుచున్నది.తల్లి ఆదేశానుసారముగా సహశ్రీ-సహస్యశ్రీ సమేత శరదృతునాయకుడు చల్లనైన-తెల్లనైన వెన్నెలలతో మనకు ఆహ్లాదమునందిస్తున్నాడు.పారిజాత వాటిక పరిమళ భరితమై తల్లి మహాత్మ్యమును చెప్పకనే చెప్పుచున్నది.  శరన్నవరాత్రులలో తల్లికి జరుపు పూజలు అసురసంహారము చేసి నెలకొలిపిన ప్రశాంతతయే సత్వగుణ ప్రకాశితమైన తెల్లనైన చల్లదనము.ఆ వెన్నెలలో అమృత స్నానము చేస్తూ ఎందరో మునులు-సిద్ధులు-యక్షులు పరమ పవిత్రమైన పారిజాత సుమములతో "పారిజాతములు నిండిన పాదములకు వందనం-ఫాలలోచనుని రాణి పార్వతి వందనం" అని పరిపరి విధముల ప్రార్థించుచున్నారు.బతుకమ్మగా పలుపువ్వులు సింగారించుకొంటున్న బంగారు గౌరమ్మను భావములో ఉయ్యాలో,అని నేనాడుచున్న ఉల్లాస  సమయమున,చెంతనే నున్ననాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...