Tuesday, May 29, 2018

TIRUMASAI ALWAAR

అదివో అల్లదివో-తిరుమళిశై ఆళ్వార్

 సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనయే  లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరుమళిశై నగరములో కనకాంగి-భార్గవ మునికి
 చిరు  మాంసపు ముద్దయాయె  శ్రీ హరి సుదర్శనము

 లక్ష్మి-నారాయణుల అనుగ్రహము లక్షణ బాలుని సేయగ
 పంకజవల్లి-తిరువాలన్ దత్త పుత్రుడాయె ధర్మమై

 వృద్ధ దంపతులను కరుణించగ క్షీరమును సేవించి
 కణి కృష్ణుని అనుగ్రహించె ఆనందమును కలిగించె

 భక్తిసారుడు అనుపేర భగవత్తత్త్వమును చాటగ
 తన మూడవ కన్నుతో ముక్కంటితో తలపడెగ

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటిన తిరుమశై ఆళ్వార్ పూజనీయుడాయెనుగ.

శ్రీవైష్ణవ సంప్రదాయం ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చక్రాయుధం, సుదర్శనం అవతారంగా భావిస్తారు. తిరుమళైశాయిలోని జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో భగవత్ కృపచే జన్మించారని నమ్ముతారు.
తిరువాలన్, పంకయా చెల్వి అన్న పిల్లలు లేని, గిరిజన దంపతులు కట్టెలు కొడుతుండగా బాలుడిని చూసి, ఇంటికి తెచ్చుకున్నారు. దంపతులకు కనికణ్ణన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతను తిరుమళిశై ఆళ్వారు శిష్యుడు అయ్యారు.
తిరుమళైశాయి ఆళ్వార్ తాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య & శూద్ర వర్ణాలకు చెందినవాణ్ణి కానని చెప్పుకున్నారు, ఒకానొక ద్విపదల్లో తనను తాను అవర్ణుడిగా అంటే కులం లేనివానిగా లేదా దళితునిగా పేర్కొన్నారు. భార్గవ మహర్షి, కనకాంగి దంపతులకు, తల్లి గర్భంలో అసహజమైన 12 నెలల గర్భవాసం అనంతరం జన్మించారు. కాలుసేతులు, ప్రాణం లేని శరీరంగా శిశువు బయటకు వచ్చాడు. దంపతులు తీవ్రంగా నిరాశ చెంది, అయిష్టంగానే ఓ వెదురుపొద కింద వదిలేసి, ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై ఆ మృతశిశువుకు మాంసం, ప్రాణం ఇచ్చి ప్రాణమున్న మనిషిని చేశారు.
అతనికి చేతులు, కాళ్ళు కూడా ఏర్పడ్డాయి, ఆప్యాయంగా ఓ గిరిజనుడైన తిరువళన్ తీసుకుని పెంచుకోవడం ప్రారంభించారు. పుణ్య దంపతులైన తిరువళన్, పంకజవల్లి ఆ బిడ్డను తమకు ప్రసాదించిన భగవంతుని కృపకు పట్టరాని సంతోషం పొందారు. పిల్లాడు పెరిగి తిరుమళిశై ఆళ్వార్ అయ్యారు.విష్ణుతత్త్వమును వివరించి జగతిని ఉధ్ధరించిన పూజనీయులు.

జై శ్రీమన్నారాయణ.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...