సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి కళత్రము
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా
పసిపాపగ ప్రకటించబడినది తులసివనములో
విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు
వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో
గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది
తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది
చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది
రంగనాథుని దేవేరిగా శ్రీరంగమున కొలువైనది
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థమును చాటిన ఆండాళ్ తల్లి పూజనీయురాలాయెగ.
ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే మన ఆండాళ్ తల్లి.తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించిన మహాపతివ్రత.ధర్మసంస్థాపనకై శ్రీవిల్లిపుత్తూరులో తులసివనమున అయోనిజగా ప్రకటించబడినది.చూడికొడుత్తాల్ అంటే తాను ధరించిన పూలమాలలతో స్వామిని ఆరాధించినది.ఆళ్వారులు పదిమంది అని వారు నారాయణుని దశావతారములు అని నమ్మువారు తండ్రి-తనయ లైన వీరిని ఒక అవతారముగానే లెక్కిస్తారు.పన్నెండు అను వారు వీరిని విడిగా పరిగణిస్తారు.తండ్రి చెప్పువిష్ణు కథలను వినుచు,విశిష్టతను తెలుసుకొని,స్వామిని తన భర్తగా ఆరాధించినది.ధనుర్మాసములో గోపకాంతలతో తానును ఒకతెగా మారి వారిచే కాత్యాయిని వ్రతమును,తిరుప్పావై వ్రతమును చేయిస్తు,వారికి ముక్తిమార్గమునకు దారిచూపినది,రామానుజుని సోదరియైన ఆండాళ్ తల్లి రంగనాథసమేతయై మనలను రక్షించును గాక.
( ఆండాల్ తిరువడిగళే శరణం.)
No comments:
Post a Comment