అదివో-అల్లదివో-పూదత్తాళ్వారు
***************************** **
సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు
ధర్మ సంస్థాపనమే- లక్ష్యమైన మన ఆళ్వారులు
తిరుక్కడల్మల్లె సముద్రతీరమున గల మాధవీపుష్పమున
ప్రకటింపబడినది కౌమోదకము బాలునిగ
భక్తికి సంకేతమైన భూతయోగి ముక్తిని అందీయగ
"ఇరండాల్ తిరువందాది" ని ఇలను ప్రసాదించెనుగ
మానసమె ఒక ప్రమిద, మాయని భక్తియె తైలము
వివేకమె జ్వలనజ్యోతి ,వినయమె శరణాగతి
పురుషోత్తముని ఆనతిని శిరసావహించి పూదత్త
పురుషార్థములందీయ దివ్యదేశముల సంచరించె
నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థము చాటిన పూదత్తాళ్వారు పూజనీయుడాయెగ.
భూతయోగి గా సంకీర్తనలందు పూదత్తాళ్వారు వారు,పొయిగై ఆళ్వారు జన్మించిన మరుసటి దినమున,మహాబలిపుర సముద్రతీరమున,మాధవీ కుసుమమున,పెరుమాళ్ళు (గద) కౌమోదక అంశమున అవతరించినారు.పూత అనగా యదార్థము,ఆత్మ అను అర్థములు కల పదమని పెద్దలుచెబుతారు.వీరు యదార్థమైన స్వామిని నూరు పాశురములతో కీర్తించిన గ్రంథము
" "ఇరణ్డాన్ తిరువందాది"గా ప్రసిద్ధికెక్కినది.పరమపూజ్యులై న పూదత్తాళ్వారును మనకు అందించిన శ్రీమన్నారాయణుడు,మనలనందరిని కరుణించుగాక.
(జై శ్రీమన్నారాయణ.)
No comments:
Post a Comment