అదివొ-అల్లదివొ--పొయిగై ఆళ్వారు
****************************** **
సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
యథోత్తకారి సన్నిధిని పుష్కరిణి స్వర్ణపుష్పమున
ప్రకటించబడినది పాంచజన్యము తిరుసంగు గ
జ్ఞాన సంకేతమైన సరోయోగి ముక్తిని అందీయగ
ముక్త పదగ్రస్తమైన ముదల్ "తిరువందాయ్" తేనెలు చిందెగ
ప్రపంచము ఒక దీపము, ప్రజ్వలన తైలము సాగరములు
సంసారము ఒక సాగరము ,సరంగు ఆ పెరుమాళ్ళు
నామ సంకీర్తన దివ్యదేశములను పావనమొనరించె
శుభ సంకల్పము విజయ శంఖమును పూరించెగ
నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థము చాటిన పోగయి ఆళ్వారు పూజనీయుడాయెగ.
******************************

పొయిగయాళ్వారు ముదలాళ్వారులలోని వాడు.తమిళములో పొయికై అంటే చెరువు.పుష్కరిణిలో తామర పుష్పములో అవతరించెను కనుక పొయికై ఆళ్వారుగా ప్రసిద్ధి చెందెను.వీరిని కాసార యోగి,సరోయోగి అని కూడ పిలుస్తారు.శ్రీ మహా విష్ణువు శంఖము పాంచజన్యమునకు అంశావతారమని భక్తుల విశ్వాసము.భగవద్దర్శనము లభించిన సమయమున పులకించి పాడిన నూరు పాశురములను "ముదల్ తిరువందాది" ని మనకు ప్రసాదించినారు. పరమపూజ్యులైన పోగయాళారును మనకు అందించిన ఆ శ్రీమన్నారాయణుడు,మనలనందరిని కాపాడు గాక.
( జై శ్రీ మన్నారాయణ.)
No comments:
Post a Comment