సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి వాహనము
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
ధన్వినవ్య పురములో ముకుందాచార్య దంపతులకు
విష్ణుచిత్తుడుగ జనియించె గరుత్మంతుడ్
విశిష్టతను తెలియచేయు అష్టాక్షరి మంత్రము
వటపత్ర సాయికిచేయు పుష్పమాలా కైంకర్యము
వాక్కు స్వామి వరమైనది వల్లభదేవునితో విజయము
ఘనతను చాటుచు మధుర వీధులలో గజారోహణము
ప్రత్యక్షమైన స్వామికి దృష్టి తగులునేమో యని
ఏనుగు గంటలే తాళాలైన పల్లాండు ప్రబంధము
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని
పరమార్థముచాటిన పెరియ ఆళ్వార్ పూజనీయుడాయెగ.
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
ధన్వినవ్య పురములో ముకుందాచార్య దంపతులకు
విష్ణుచిత్తుడుగ జనియించె గరుత్మంతుడ్
విశిష్టతను తెలియచేయు అష్టాక్షరి మంత్రము
వటపత్ర సాయికిచేయు పుష్పమాలా కైంకర్యము
వాక్కు స్వామి వరమైనది వల్లభదేవునితో విజయము
ఘనతను చాటుచు మధుర వీధులలో గజారోహణము
ప్రత్యక్షమైన స్వామికి దృష్టి తగులునేమో యని
ఏనుగు గంటలే తాళాలైన పల్లాండు ప్రబంధము
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని
పరమార్థముచాటిన పెరియ ఆళ్వార్ పూజనీయుడాయెగ.
గరుత్మంతుని అంశతో శ్రీవిల్లిపుత్తూరునందు ముకుందాచార్యులు దంపతులకు పెరియాళ్వారు జన్మించారు.తల్లితండ్రులు ప్ర్ట్టిన పేరి విష్ణుచిత్తులు.చిన్నతనము నుండి అష్టాక్షరీ మంత్రమును అనవరతము మననము చేసెడివారు.స్వామివారి తోమాలాలచే ప్రభావితుడై,పుష్ప కైంకర్యముతో స్వామిని సేవించ దలచి,నిష్ఠగా పూమాలా కైంకర్యము చేయసాగెను.పాండ్యరాజు బ్రహ్మణోత్తముని వలన జీవిత పరమార్థమును తెలిసికొని,పరతత్త్వమును తెలియచేసినవారికి సువర్ణనాణెముల సంచిని బహుమతిగ ప్రకటించెను.స్వామి కోరిక ప్రకారము విష్ణుచిత్తుడు సభలో అష్టాక్షరీ మంత్ర వైభవమును వివరించి,గజారోహణ చేయుచుండగా,లక్ష్మీ నారాయణులు గరుత్మంతునిపై ప్రత్యక్ష్మైన,ఎనుగు గంటలను తాళములుగా వాయించుచు,పల్లాండ్లు పాడి పరవశించిన,పెరియాళ్వారునూనుగ్ రహించిన నారాయణుడు మనలనందరిని అనుగ్రహించుగాక,
No comments:
Post a Comment