Sunday, May 5, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-22

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-22
 **************************

 భగవంతుడు ఆనందతాండవ లోలుడు-భక్తురాలు దర్శించు పుణ్యశాలి.

  " భరత వేదముగ నిరత నాట్యముగ కదిలెడు పదమిది ఈశా
    .....................
    నమకచమకముల నాదాన-యమకగమకముల యోగాన
    ప్రణవనాద ప్రాణాన-ప్రణతులందుకొను ప్రమథనాథ"

    పరమేశా పాహి పాహి పాహిమాం.


  సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను నిర్వర్తిస్తూ స్వామి తాండవమ్ను చేస్తుంటాడు.స్వామి తాండవము సగుణ స్వరూపమునకు,సమాధి నిర్గుణ స్వరూపమునకు సంకేతములు.ఒక విధముగా చెప్పాలంటే

   ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరాఘోరతరేభ్యః.స్వామి అఘోరుడై విశ్వచక్రమును నడిపిస్తాడు.ఘోరుడై సర్వమును జలమయము చేసి తానొక్కడే నిర్వికారుడై నిశ్చల సమాధిలో నిమీలిత నేత్రుడై నిండిపోతాడు.తిరిగి సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములు.కనుకనే స్వామి కాలాతీతుడు.

 " నటనం ఆడెనే -ఆ పరమశివుడు తిమిరసంహరుడు
   నటనావతంసుడై తకధిమి తక యని అనురాగమయుడై"

    ఆడెనే ఆ ఆదిదేవుడు అతిదయార్ద్రహృదయుడై" నమోనమః.

 ఆనందతాండవ ఆవిర్భావమునకు వ్యాఘ్రపాదుడు అనుగ్రహమును సంపాదించినాడు.

  ఒకనాడు మహాజ్ఞానియైన వ్యాఘ్రపాదులవారు "తిల్లైవనము" లో చేసిన లింగపూజలకు స్వామి అత్యంత సంతుష్టుడై,సాక్షాత్కరించి,ఏదైనా వరమును కోరుకోమనెను.

" నమో బృహతేచ వర్షీయసేచ" పెద్దమనసుతో వరములను వర్షించు స్వామిని,ముద్దుతీర్చమని వేడుకున్నాడు వద్దనలేని విధముగా.స్వామి ఈ నిర్భాగ్యుని కరుణించిన నీలకంఠేశ్వరా.లోక కళ్యాణార్థమై అంబా సమేతుడవై తిల్లైవనము లో ప్రతిరోజు  బ్రహ్మ ముహూర్తమున ఆనందతాండవమాడమని ,తనను తరింపచేయమని వేడుకున్నాడు.తథాస్తు అన్నాడు తరగని కరుణగల తాండవప్రియుడు.

   వేదం అణువణువున నాదం- నా పంచ ప్రాణాల నాట్య వినోదం.

  భగవంతుడు ఆనందతాండవమును అనుగ్రహిస్తే భక్తురాలు ఆ సమయమున తాను స్వామి పాదముల చెంతనే యుండి అనుగుణముగా గానమును ఆలపిస్తూ,ఆనందించే వరమును పొందినది,అంతా అంబే శివం.హర హర మహదేవ శంభో శంకర.

   పూర్వము కరెక్కాల్ వృధ్ధిచెందుతున్న ఓడరేవు.ఆ నగరమునందలి వైశ్యులు ధర్మపరాయణులు.వారి నాయకుడు ధనదత్తుడు.సత్యవాక్యపరిపాలకుడు.శివానుగ్రహముగ వారికి సర్వలక్షణ సంపన్నయైన ఒక కుమార్తె జన్మించినది.పునీతవతి నామధేయము సార్థకముగానున్నదన్నట్లు సర్వ శుభలక్షణ సంపన్నయై నిరంతరము సాంబశివుని ధ్యానించుచు,సాటి వారికి సాయము చేయుచు శోభిల్లుచుండెను.శివసంకల్పముగా ఆమెకు పరమ యోగ్యుడైన నిధిపతి పతియైనాడు.పుణ్యదంపతులిద్దరు కరిక్కాల లో ధర్మకార్యములను ఆచరించుచు ఆనందముగా కాలము గడుపుతున్నారు.


 ' నమో వృక్షాణాం పతయే నమః"

  తన భక్తురాలిని ఉధ్ధరించుటకు మామిడిచెట్టు తన పండ్లతో గారడిచేసినది.స్వామి ఆనగా సాధ్విని చేరినది.చమత్కారములతో తన మమకారమును చాటినది.చిక్కని సంసారబంధముల చిక్కులను విడదీసినది.అంతా ఈశ్వరేఛ్ఛ.


  మామిడిపండ్లను  జరొగబోవు పరిణామములకు పాత్రధారులను చేసాడు మాహేశుడు.నిధిపతి రెండు మామిడిపండ్లను ఇంటికి పంపించాడు.రానేవచ్చాడు శివుడు రాగవిముక్తురాలిని చేయటానికి పునీతవతిని. భోజనములోని అడిగి వేయించుక్కున్నాడు ఆమ్రఫలమును.భర్త వచ్చిన తరువాత మామిడిపండును తిని రెండో పండును అడిగాడు.ఆమె శివుని అడిగింది.ఇచ్చాడు.పతికి ఇచ్చింది పరమసాధ్వి.పసిగట్టాడు రుచిని.ప్రశ్నించాడు భార్యను ఎక్కడిది ఈ పండూను? సత్యవాక్పరిపాలకురాలు కనుక పరమేశ్వరానుగ్రమని చెప్పింది

   పరమేశ్వరుని పాచిక పారింది.ప్రత్యక్షముగా జరుగుచున్నది చూశాడు.పునీతవతి సామాన్య స్త్రీ కాదు.దైవాంశ సంభూతురాలిగా గుర్తించాడు.
  జంగమదేవుడు తలచుకుంటే జరుగవలసినది జరుగక మానదు కదా.పాశ విముక్తురాలిని చేయాలనుకున్నాడు పునీతవతిని."నమః సోభ్యాయచ." పుణ్య-పాప మిళితమైన లోకమున పునీతవతికి కేవలము పుణ్యమును అనుగ్రహింపదలిచాడు.నిధిపతి వేరొకరిని వివాహము చేసుకొనినాడని తెలియగానే పుణ్యవతి" నమః శివాభ్యాం నవయవ్వానాభ్యాం" ని, తన శరీర సౌందర్యమును యవ్వనమును తీసివేయమని శివుని ప్రార్థించినది.

  "నమో వృధ్ధాయచ-సంవృద్ధయేచ."

స్వామి నా శరీరమునకు వృధ్ధాప్యమును,నా శివభక్తికి సంవృధ్ధిని ప్రాసాదింపుము.శరణు-శరణు గిరిజారమణ అని ప్రార్థించినది ఆ పరమసాధ్వి.పరమేశ్వరతత్త్వమును స్వాధీన పరచుకొన్న భాగ్యశాలి." విరూపేభ్యో-విశ్వరూపేభ్యో నమో నమః."

 శివనామ సంకీర్తనలతో భవరోగాంధ విముక్తులను చేయుచు ,ప్రజలలో భక్తిప్రపత్తులను పెంచింది.జీవితపరమార్థమును బోధించసాగినది.

 " మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా
   ఇహపర సాధనమే జనులకు సురుచిర పావనమే
   భావజ సంహారా నన్ను కావగ రావయ్యా' అంటు అనవరతము ధ్యానిస్తు ఉండేది.

  నిర్గుణభక్తి నిటలాక్ష నివాసమునకు నిచ్చెన వేసింది.

 కైలాసపురి నుండి కాశికై స్వామి వస్తే తాను నేరుగా కైలాసము చేరుకోగలిగింది స్వామి దయతో.ఎటుచూసిన శివలింగములు.ఎటువైపు విన్న శివ పంచాక్షరి.తన కాలుమోపి అపవిత్రము చేయరాదనుకొన్నది.తలకిందులుగా నడవసాగింది తనస్వామి పాదములను తాకగ.

    తగవులాడింది పార్వతి శివునితో ఇది తగదు అని.తాత్సారమే చేయరాదంది.అంతే,

  " శా0తం పద్మాసనస్థం శశిధరమకుటం"

 సమీపించారు తల్లిని పార్వతీపరమేశ్వరులు." అమ్మా! అని నమస్కరించాడు ఆదిదేవుడు.నీ భక్తి తత్పరత అజరామరము.వరము కోరుకో తల్లీ.ఆనందముతో అనుగ్రహిస్తాను అన్నాడు.మీడుష్టపతి.దయను వర్షించే ధనంజయనేత్రుడు.పునీతవతి పులకరించి ప్రస్తుతించింది.

  జగత్కళ్యాణమును జరిపించమంది.మరొక వరము ఆమెకు అడిగే అవకాశమును కలిగించింది ఆమె నిస్వార్థము

 కిం యానేన ధనేన నాజికరిభిః ప్రాప్తేన రాజ్యన కిం
 కిం న పుత్ర కలత్ర మిత్ర పశుభిః దేహాన గేహాన కిం
 జ్ఞాత్వైతత్  క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
 స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం."

 అని క్షణభంగురములైన వాతితో తనకేమి పని అని అయిన సివపద సేవనమును కోరుకున్నది ఆ భాగ్యశాలిని.
.స్వామి ఆనందతాండవము చేయునపుడు తాను స్వామి పాదముల దగ్గర నుండి పాడుచు పరవశించు భాగ్యమును కోరింది.

 " శరణం నీ దివ్య చరణం-నీ నామమెంతో మధురం" శ్రీ నీలకంఠదేవా అని సర్వస్య శరణాగతిని కోరింది.తథాస్తు అన్నాడు తకధిమి నర్తనములవాడు.

  అలంగారు అను పురాతనమైన చోట నా పాదముల దగ్గరే కూర్చొని,నా భంగిమలకు అనుగుణముగా నన్ను కీర్తించుచు,పరవశించు భాగ్యమును ప్రసాదించుచున్నాను అన్నాడు క్షిప్రప్రసాదుడు.

 అమ్మను అనుగ్రహించిన ఆదిదేవుడు మనలను కూడ తన అక్కున చేర్చుకొను గాక

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం).


  ( ఏక బిల్వం శివార్పణం.)





  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...