మార్గళి మాలై-10
*****************
పదవ పాశురము
******************
నోత్తు చ్చువర్క్కం పుగుగిన్ర అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిరవాదార్?
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పరై తరుం పుణ్ణియనాల్ పండు ఒరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళంద కుంబకరణనుం
తోత్తు మునక్కే పెరుం తుయిల్ తాన్ తందానో?
ఆత్త అనందలు డైయాయ్! అరుంగలమే!
తేత్తమాయ్ వందు తిర ఏలోరెంబావాయ్!
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
**************************
శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము
నోము ఫలముగా సువర్గసంగములో నున్నావో
తలుపుగడియ తీయవు, బదులైన పలుకవు
తులసిమాల పరిమళములు స్వామిజాడలైనవిలే
ఏదో ఒకనాడు, మాకు ఫలమును అందించునులే
మృత్యువాత పడిన ఆ కుంభకర్ణుని మొద్దునిద్ర
నిన్ను చేరినదా ఏమి? అన్నిటిని మరచినావు
తత్తరపాటును వీడి, తలుపుతీయ రావమ్మా
తరలివచ్చినది తల్లి, తానొక గోపికయై
పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
"నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో! ఓ భూషణమా.!
"తిరుపళ్ళి ఎళుచ్చి " పాశురములలో ఐదవ గోపికను గోదమ్మ అమ్మన్నాయ్ అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనను చూడాలన్నా,తాను స్వామిని చూడాలన్న అడ్డుగోడను దూకి వెళ్ళి ఆనందించేవారట.స్వామితో అత్యంత సాన్నిహిత్యము కలది కనుక స్వామిని ( అమ్మణ్ణాయ్.)అని సంబోధిస్తున్నది.గోదమ్మ.
తొమ్మిదవ పాశురములోని గోపిక అంతఃపురములో అత్యంత విభవముతో నున్నను వాటిని స్వీకరించక కృష్ణభావ తాదాత్మ్యములో నున్నది.ఆమె మేడ మీద ఉన్నది.ఏమిటా మేడ?
అన్నిటి కన్నా ఎత్తైన స్థానములో నుండి వస్తువులు స్వరూప-సమర్థతలను తెలియచేయునది.గోపికల పిలుపులకు మేల్కొనలేదని మేల్కాంచుటకు అత్త, సంకీర్తనమును చేయమని ఉపాయమును చెప్పినది. ఇది దేహ సంబంధ జ్ఞానము.
ఇప్పటి పాశురములో గోదమ్మ దైవ సంబంధ జ్ఞానమును మనకు పరియచయము చేస్తున్నది.పర కై ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము
కదా!
"వాశల్ తిరవాదార్" తలుపు గడియ తీయమంటున్నారు బయటనున్న గోపికలు.ఫలితము లేదు.కనీసము "మాత్తాముం తారారో" మాటైన పలుకవమ్మా అంటున్నారు.గదిలోపలి నుండి సర్వగంధ శోభితుడు ధరించిన తులసి పరిమళములు బయటకు వ్యాపిస్తు స్వామి ఉనికిని తెలియచేస్తున్నాయంటున్నారు గోపికలు.కాని బదులు రాలేదు లోపటి నుంచి.
ఈ గోపికను మేల్కొలుపుతు గోదమ్మ మూడు విషయములను ప్రస్తావించినది.
మొదటిది జీవాత్మ-పరమాత్మ అలౌకిక మిథునము.దానికి గుర్తుగా"నాత్తత్తుళాయ్
" తులసిమాలల పరిమళములను గోపికలు గుర్తించినారు."సర్వ గంధ స్వామి" పాదములు వేద గంధము తోను,చేతులు పెదవులు నాద గంధము తోను,ఉరము కస్తురి గంధము తోను అపురూపముగా పరిఢవిల్లుచున్నవి.
ఆ సుగంధములు స్వామి నిర్హేతుక కృపాకటాక్షములు.దానికి నిదర్శనమే "సకలేంద్రియ నివృత్తి "అను మన గోపిక నిద్ర.స్వామికి స్వామి వైభవమునకు వ్యత్యాసములేదు.పక్క ఇల్లు అన్నారు కదా.పరస్పరము పరమానందముతో ఉన్నారు.గోపికలతో బయటకు వెళ్ళుట ఆమె ఉన్న స్థితి కన్న చాలా చిన్నది.
"పోత్త ప్పరై తరుం పుణ్ణియనాల్ పండు ఒరునాళ్' అని,
బయటి వారు స్వామి గుణగణములను కీర్తిస్తున్నారు.అవి పరమానంద భరితములు.తలుపు తీస్తే కీర్తనము
ఆగిపోతుంది కనుక అంతర్ముఖియైన గోపిక పుణ్యకీర్తి-పుణ్యలబ్ధ-పుణ్య శ్రవణ కీర్తనమును ఆస్వాదిస్తున్నది.
ఇంతలో ప్రవేశించాడు "కూత్తత్తిన్ వాయ్"మృత్యువు నోటబడిన కుంభకర్ణుడు తన మొద్దు నిద్దురను ఆమెకిచ్చి.ఆ మాట వినబడగానే గోపిక బహిర్ముఖియైనది."తేత్తమాయ్ వందు"
తత్తర పాటుతో బయటకు రాబోతున్న సమయమున గోపికలు ఆమెఉన్న స్థితిని హెచ్చరించి సావధానముగా భక్తి సమర్పణమునకు రమ్మన్నారు.
ఎవరీ కుంభకర్ణుడు? అతని నిద్ర పరమార్థమేమిటి? ద్రవిడ సంప్రదాయానుసారము-కుంభము కుండ నుండి పుట్టిన వాడు అగస్త్య మహర్షి.రూపము కురుచ-శక్తులు ఘనము.ఈయన మూడు కార్యములను జగత్కళ్యాణమునకు చేసినాడు.మొదటిది వింధ్య పర్వతమును నకు వినయమును నేర్పెను.రెండవది (జ్ఞాన) సముద్రమును అవపోసన పట్టెను.వాతాపిని (అసురత్వమును) అంతమొందించెను. అనవరతము భగవత్తత్త్వముతో రమించుటయే ఆయన పోవు నిద్ర.త్వమేవాహం అను పధ్ధతి.
మన గోపిక కూడ సద్గుణభూయిష్ట కనుక ఆమెను వ్రత నిర్వాహకురాలిని చేసినది . గోదమ్మ వేరొక గోపికను మేలుకొలుపుటకుతల్లి బయలుదేరినది.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం)
No comments:
Post a Comment