మర్గళి మాలై-08
******************
ఎనిమిదో పాశురము
***************
కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్పరందన కాణ్! మిక్కుళై పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు ఉన్నై
క్కూవువాన్ వందు నిన్రోం కోదుకుల ముడియై
పావాయ్! ఎళుందిరాయ్ పాడిపరై కొండు
మావాయ్ పిళిందానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రు నాం శేవిత్తాల్
ఆవావెన్రు ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*************************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము
తూరుపు చీకట్లు తొలగి తెల్లవారినది నేడు
గేదెలు చిన్నమేతకై పయనమైనవి చూడు
పూజకు వెళుతున్నవారిని నీకొరకై నిలిపినాము
నిన్ను తోడ్కొని పోవగ అందరము వచ్చినాము
ముష్టిక-చాణూరులను మట్టుబెట్టిన స్వామి
పావన సంకీర్తనముతో పావాయ్ మేలుకో
వచ్చేసారా మీరు అను దేవాదిదేవుని కొలువ
తరలివచ్చినది తల్లి తానొక గోపికయై
పాశురములు పాడుచు,పాశములన్నింటిని వదిలి
నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో!ఓ మానిని.
ఆరు_ఏడు పాశురములలో నిదురించు గోపికలను మేల్కొలుపుటకు శ్రవణమును.ఈ పాశురములోని గోపిక భగవదర్శన కుతూహలము కలది.తానును పరమాత్మయు పరస్పర అధీనులుగా భావించునది.(శ్రీమాన్ పేయ్ ఆళ్వారుగా భావిస్తారు.) చతుర గోపికను మేల్కొలుపుటకు అమ్మ దృశ్య ఉపకరణమును ప్రస్తావించు,.గోదమ్మ చెప్పిన-చూపిన గురుతులకు పరధర్మ-ధర్మిత్వమును ఆరోపించి,చతురతతో చమత్కరించినది ఈ నాటి గోపిక.
గోదమ్మ "కీళ్వానుం వెళ్లెన్రు" అంటూ తూరుపు దిక్కు చీకట్లను తరిమివేసి తెల్లదనపు కాంతులతో నున్నది చూడు అనగానే,
చతుర గోపిక ఆ ప్రకాశము ఉషోదయమునది కాదని వ్రతమునకు సంసిధ్ధులగుచున్న గోపికల ఉత్సాహ ముఖవర్చస్సుగా సమర్థించినది.
రెండవ దృశ్యమైన "ఎరుమై "గేదెలు శిరువీడు-చిన్న మేతకు వెళ్ళుచున్నవనినది,కనుక ఆ ప్రదేశమంతయు నల్లగా మారినది చూడు అని గోదమ్మ అనగానే,
నేను నమ్మను.ఆ నల్లరంగు మేతకు వెళ్ళుచున్న గేదెలది కాదు.మీ ముఖవర్చస్సు తెల్లగా ప్రకాశిస్తున్న చోట ముందున్న చీకటికదిలి వేరొక చోటకు పయనించు చున్నదనెను.
గేదెలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే చిన్న మేతకు.కొద్ది సమయమునకే అవి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి.తమోగుణము పరాశ్రయతత్త్వము కలది.స్వతంత్రముగా ఎక్కువ సేపు ఉండలేదు.కనుక అది తిరిగి వచ్చి నిన్ను చేరేలోపున త్వరగా మేల్కొని వ్రతమునకు పోదాము అన్న అంతరార్థము.
"పోవాన్ పోగిన్రారై ప్పోగామల్ కాత్తు" గోపకాంతలు ఉత్సాహముతో వ్రతమునకు వెల్లుచుండగా నీ కొరకు వారిని ,పోనీయకుండా నిలిపి,నిన్ను మేల్కొలుపుటకు వచ్చాం అన్నారట.
ఇప్పుడు లోపలి గోపిక తన దగ్గరికి వచ్చిన గోపికలతో ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చేయాలి? ఏమి ప్రయోజనము? చెప్పండి అని అడిగినదట.
గోపిక తమతో తీసుకొని వెళ్ళవలెనని ,వారు కేశిని చంపిన వానిని,ముష్టియుధ్ధములో చాణూర-ముష్టికాసురను భంజించిన వానిని పాడి-కీర్తించి,"పరై కొండు" పర ను తీసుకుందాము.అన్నారట.
అహంకార-మమకారములు-ఆరాట-పోరాటములు,సుఖ-దుఖములను ద్వంద్వములే ఈ చాణూర-ముష్టికాసురులు.
.ఇక్కడ వారిది నిశ్చయ భక్తి కనుక స్వామి ఇస్తాడో ఇవ్వడో అను సందేహము లేదు.స్వామి దగ్గర నుండి తమకు తామే" కొండు" తెచ్చుకోగలరు అన్నారు.
,తానును తల్లితో గోష్టికి వెళ్లదలచుకొన్న చతుర గోపికను కలుపుకొని,వేరొక గోపికను మేల్కొలుపుటకు గోదమ్మ తరలుచున్నది.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
No comments:
Post a Comment