Thursday, November 7, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-13

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-13
**************************

    " రావయ్యా రావయ్యా రా కూడల జంగమదేవా రా
      శరణు శరణు సంగమదేవ కరుణను కావుము సంగమదేవ"

   అనుచు భక్తులు స్వామి దర్శనమునకు ఎదురుచూచుచు,భక్తి పారవశ్యముతో మునితేలు తుంటారు.

 " నమః తీర్థాయచ కూల్యాయచ"

 తీర్థములందున్న వానికి,తీర్థపు గట్టుల నందున్న రుద్రునికి నమస్కారములు.

  కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలములో తుంగ-భద్ర-కృష్ణ-వేణి-భీవిలి-మలాపహారి-భవనాశి అను ఏడు నదుల సంగమ కూడలిలో స్వామి సంగమేశ్వరుడు.

 నీ దయ గౌతము గంగా చేరగ నీ పాదము కడుగంగ ఈశా,

 నివృత్తి సంగమేశ్వరుడు,రూపాల సంగమేశ్వరుడు,కూడలి సంగమేశ్వరుడు అను బహు రూపములతో భాసించు స్వామి,ఏడాడిలో ఎనిమిది ఎలలు ఈటిలో ఉండి,కేవలము నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడటభక్తుల పాపములతో మలిన మైఅగంగమ్మ తల్లి ఈ ఏడునదుల సంగమములో స్నానమాచరించి పాపప్రక్షాళనమును చేసుకుంటుందట.

 మరికొందరి అభిప్రాయము ప్రకారము సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రదేశము కనుక నివృత్తి సంగమేశ్వరముగా కీర్తిస్తారు.అమ్మవారైన అయ్యవారైన అర్థనారీశ్వరమే కదా.ప్రార్థనలకు సార్థకతను అందించేది.నమో నమః.

 ఈ ఏడు నదులలో "భవనాశి" తూర్పు నుండి పశ్చిమమునకు ప్రవహిస్తుందని,మిగిలిన ఆరు నదులు పశ్చిమము నుండి తూర్పు వైపునకు ప్రవహిస్తు,అష్టాదశ శక్తి పీఠమైన,జ్యోత్రిలింగ స్వరూపమును తాకుతూ
ప్రవహించి చివరకు సముద్రములో కలిసిపోతాయట.నదీనా సాగరో గతి:

నమః శ్శీఘ్రియాయచ శీభ్యాయచ."

జలప్రవాహము తానై-జలప్రవాహమునందున్న రుద్రునకు నమస్కారములు.

 మనము స్వామి నిర్హేతుక కృపాకటాక్షమును లోకవిదితము చేసినభక్తుల కథలను గురించి తెలిసికొను ప్రయత్నము చేద్దాము.

  మొదటి భక్తుడు తిరుచిత్తబలుడు.పవిత్రమైనమనస్సుతో పరమేశ్వరుని ధ్యానించువాడు.స్వామి సేవకై ఒక గంపలో పూలు-ఫళ్ళు పెట్టుకుని వర్షముతో తడిసిన బురద దారిలో వెళ్ళుచుండగా,కాలుజారి క్రిందపడబోయెను.నమో సూద్యాయచ" బురదరూపలో నున్నస్వామి భక్తుని చేయిపట్టుకొని (భక్తి) పడిపోకుండా కాపాడాడు.

   నిటలాక్షుని నిర్హేతుక కృపకు నిదర్శనము మరొక కథ...

ఇది అర్థము చేసుకుంటే జీవాత్మ-పరమాత్మను అనుసరించుట,పరమాత్మ జీవాత్మను అనుగ్రహించుట కనువిందు చేస్తుంది ముక్కంటి లీల.

    సంసార భవబంధములను గుంజకు కట్టివేయబడినది ఒక దూడ.భవబంధములను తెంచుకొని,ఈశ్వరానుగ్రహము అను పచ్చికను మేయుటకు పరుగుతీయసాగినది.

 " నమో ఉర్వర్యాయచ-ఖల్యాయచ." పంట భూమి-పంటభూమిలో పాతిన గుంజ రెండును తానైన స్వామిమరొక జీవిని పునీతుని చేయమని తన నందిని ఆదేశించినాడేమో! ఎవరికి తెలుసు ఏమి జరుగనున్నదో?

  తమస్సులోనుండి లేచిన మల్లన్నకు దూడ కనిపించలేదు.వెతుకుటకు బయలుదేరినాదు మల్లన్న లోని జీవుడు.మనసంతా ఆందోళన.అసలు తోచడములేదు.ఆత్మ పరమాత్మను వెతుకు పనిలో పరమాద్భుతములు పల్లవించుచున్నవి.

  నమః సస్పింజరాయ-లేత పచ్చికను తింటు మల్లన దూడ వలె కనిపించసాగినది.దూడ అనే ఈశ్వరచైతన్యమును పట్టుకొనవలెనని తెలిసికొనిన మల్లన్న అక్కడికి చేరగానే,దూడ నీరు త్రాగుటకై గట్లవెంట-ఇరుకు చలముల వెంట నడువసాగినది.నామసుధారస పానము చేసి,నర్తించవే ఓ మనసా అంటున్నాడా నందీశ్వరుడు నాటకము రక్తి కడుతోంది.

 నందీశుని ఆనగా నంది దారి మళ్ళుచున్నది మల్లేశుని లీలగా మల్లన్నను తన దారికి తెప్పిస్తు.పశువు-పశుపతి రెండు తానైన స్వామి మల్లన్నను పాశముతో బంధించి,పరుగులు తీయిస్తున్నాడు.పరమార్థము దొరకాలంటే పరమేశ్వరుని వెంట పరుగులు తీయాలి కదా.


 పంకజనేత్రుని పంకమున దిగినది దూడ తన జాడను తెలుపుతూ.పరుగులు తీశాడు పట్టుకున్నాడు పశువుతో పాటు పశుపతిని మల్లన్న.ప్రశాంతముగా మల్లయ్యను అనుసరించింది దూడ.పరమార్థమునందించిన ఱేడై.

  బురద (భవబంధములను) కడుగుకొంటున్నాడు మల్లన్న.విచిత్రము.రొష్టుపెట్టు కుష్టువ్యాధి మాయము.బాహ్యమున.అష్టమూర్తికి ఆసనమైనది ఆంతర్యము అవధులులేని ఆనందముతో .

   రేపు బిల్వార్చనకు కలుసుకుందాము.

 ఏక బిల్వం శివార్పణం.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...