Wednesday, November 6, 2019

nah prayachchanti saukhyam-vaidyulu.

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-12
  ************************

"అచికిత్స -చికిత్సాయ ఆద్యంత రహితాయచ
  సర్వలోకై వంద్యాయ వైద్యనాథయతే నమః"

  దేగడ్ లోని జ్యోతిర్లింగముతో సమానముగా మహారాష్ట్ర పర్లీ జ్యోతిర్లింగము ప్రశస్తమైనది."లీనతే గమ్యతే ఇతి లింగం".జగత్తు దేనియందు జనించి-దేనియందు లయమవుతుందో ఆ పరమాద్భుత శక్తిస్వరూపమే లింగము.ప్రతిదేహములోను ఆత్మ అనే లింగము ప్రకాశిస్తుంటుంది.

వైద్యభ్యం పూజితం సర్వం.నమోనమః.




  స్వామి కొలువైన ప్రాంతమునకు చుట్టునున్న కొండకోనలు,దట్టమైన అరణ్యములు,నదీ ప్రవాహక ప్రాంతములు స్వామి ప్రసాదములైన అనేక ఔషధములతో అలరారుచుండును కనుక వైద్యనాధునిగా స్వామి కీర్తింపబడుచున్నాడు.


"నమ ఊర్వాయచ సూర్మ్యాయచ"
భూమియందున్న వానిలోను,మంచి తరంగములున్న వానియందుండు శివా నమస్కారములు.ఆ శివస్వరూపమే ఔషధములనందించి,మనలను తిరిగి రోగములను దరిచేరనీయక సంపూర్ణ శారీరక-మానసిక ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించుచున్నది.

" అకాల మృత్యు హరణం-సర్వవ్యాధి నివారణం-సమస్త పాపక్షయకరం." శివానుగ్రహం.ఎంత మంచివాడవురా సాంబశివ-నిన్నేమని కీర్తించగలను సదాశివా.పాహి-పాహి

" ఓం భువంతయే వారివస్కృతాణాం పతయే నమః."

   వరివః ధనం కరోతి ఇతి వారివస్కృతానాం.భక్తులందుండు వాడు-భక్తులు వారివస్కృతులే.ఐశ్వర్య స్వరూపులే.

 తన భక్తురాలైన నక్కనయనరు ధర్మపత్ని ఈశ్వరభక్తిని లోకప్రసిద్ధము చేయాలన్న తలంపు చిలిపిదై శ్రీకాళహస్తీశ్వరుని శ్రీ ని సాలెపురుగును పరికరముగా మలచినది.స్వామియాజ్ఞ మీరగలదా? స్వామిలింగము చుట్టును భక్తురాలు చూచుచుండగనే తొలగించలేని విధముగా పాకుచున్నది.నక్కనయనరు పత్ని మనసులో భయాందోళలను కలుగచేయుచు తాను కక్కుతున్న విషముతో స్వామి శరీరమున పొక్కులను సృష్టించి ,భయాందోళన దారములను అల్లుచున్నది ఆ శ్రీపురుగు.

   స్వామి శరీరమును చూసి,పడుతున్న బాధను చూసి ఎంత తల్లడిల్లినదో ఆ తల్లి.


 " ఉగణాభ్యశ్చ నమో నమః"

  ఉత్కృష్ట శ్త్రీశక్తి గణముల స్వరూపమైనది.ఉచితానుచితములనూధిగమించినది.నిరంతర నామస్మరణమునకు తోడైన ఉమ్మియే నెమ్మదింపచేయునని భావించినది.అది భక్తురాలి లాలాజలమో-భావంతుని లీలా జాలమో.నమోనమః.స్వామి ముఖము మీదకు తన ఉమ్మిని ప్రసరింప చేసినది.అంతే,

 స్వామి సత్యసుందరుడైనాడు.సాధ్వి మనసు స్వాంతనను పొందింది.కాని అదే,

 స్వామి బాధను తీర్చివేసినది-సాధ్వి కథకు తీర్పునిచ్చింది.


జ్ఞాన చక్షువులకు గల శక్తిని చర్మచక్షువులు పొందలేవు కదా! తన భార్య కానిపని చేసినదని శిక్షగా ఇంటినుండి వెడలగొట్టినాడు నాయనారు.శివాపరాధమునకు చింతించుచు చిరునిద్ర లోనికి జారినాడు.

 " నమః స్వపధ్యో జాగ్రదభ్యశ్చవోనమో నమః."
నిద్రించుచున్నవారిలో,మెలకువతో నున్న వారిలోను కల రుద్రులకు నమస్కారములు.

నిద్రించుచున్న నార్యనారునకు స్వప్నమున సాక్షాత్కరించి,తన భక్తురాలు చేసిన వైద్యము తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదని వారిరువురిని అనుగ్రహించినాడు ఈశ్వరుడు.

   నిద్రించుచున్న నక్క నాయనారు శివచైతన్యమును మేల్కొలిపి,మంగళప్రదమైన జ్ఞానమను ఔషధమును ప్రసాదించిన సర్వేశ్వరుని,

  బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

  ఏక బిల్వం శివార్పణం.


.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...