ప్రార్థన
**********
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం
లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం
యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహతస్తత్ ఇతరాణి తృణాయమానే
అస్మద్గురో భగవతోస్య దయైక సింధో
రామానుజస్య చరం శరణం ప్రపద్యే.
సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి కళత్రము
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన ఆండాళ్ తల్లి అనుగ్రహము.
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా
పసిపాపగ ప్రకటించబడినది తులసివనములో
విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు
వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో
గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది
తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది
చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది
రంగనాథుని దేవేరిగా శ్రీరంగమున కొలువైనది
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థమును చాటిన ఆండాళ్ తల్లి పూజనీయురాలాయెగ.
ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే మన ఆండాళ్ తల్లి.తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించిన మహాపతివ్రత.ధర్మసంస్థాపనకై శ్రీవిల్లిపుత్తూరులో తులసివనమున అయోనిజగా ప్రకటించబడినది.చూడికొడుత్తాల్ అంటే తాను ధరించిన పూలమాలలతో స్వామిని ఆరాధించినది.ఆళ్వారులు పదిమంది అని వారు నారాయణుని దశావతారములు అని నమ్మువారు తండ్రి-తనయ లైన వీరిని ఒక అవతారముగానే లెక్కిస్తారు.పన్నెండు అను వారు వీరిని విడిగా పరిగణిస్తారు.తండ్రి చెప్పువిష్ణు కథలను వినుచు,విశిష్టతను తెలుసుకొని,స్వామిని తన భర్తగా ఆరాధించినది.ధనుర్మాసములో గోపకాంతలతో తానును ఒకతెగా మారి వారిచే కాత్యాయిని వ్రతమును,తిరుప్పావై వ్రతమును చేయిస్తు,వారికి ముక్తిమార్గమునకు దారిచూపినది,రామానుజుని సోదరియైన ఆండాళ్ తల్లి రంగనాథసమేతయై మనలను రక్షించును గాక క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై అను ద్రవిడప్రబంధ విశేషములను తల్లి అనుగ్రహము మేర మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.
పరమ పావనమైన తిరు-శుభకరమైన పావై వ్రతము నవవిధభక్తి సమ్మేళనము .నందగోపాలుని నవనీతచోరుని దివ్యలీలా తరంగము.
ఈ వ్రతమును ఆచరించిన గోపికలను ఆళ్వారులుగాను,అప్సరసల గాను అభివర్ణిస్తారు పెద్దలు.భగవదనుగ్రహమునకు అంతరంగ సర్వస్య శరణాగతి సాఫల్యకారి అని చాటిచెప్పుచున్నది.
నా ఈ దుస్సాహసమును పెద్ద మనసుతో మన్నించి,మార్గళి మాలను సుగంధభరితము చేయుట పెద్ద సన్మానముగా భావించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

.
( ఆండాల్ తిరువడిగళే శరణం.)
namaste.
ReplyDelete