Friday, February 7, 2020

SURYA TANULEKHANAMU.

 సూర్య తనూలేఖనము.
 *********************
 " న ఉదేతివా న అస్తమేతి" -ఐతరేయ బ్రాహ్మణము.

  మన కంటితో నేరుగా చూడగలిగే పరమాత సూర్యభగవానుడు ఒక్కడే.ఉదయాస్తమానములు లేని పరమాద్భుతశక్తి.సూర్యుని భౌతికాంశమే మనకు కనబడే మండలము.చైతన్యాంశము మనము అనుభవిస్తున్న అనిర్వచనీయమూర్తి.తన నుండి వచ్చిన దేవతలను,సకలభువనభాండములను రక్షించుటకు అదితీగర్భ సంభూతుడైన అవ్యాజకరుణామూర్తి.

 "ఆదిత్యాయ నమోనమః."


 " అదితి" అను శబ్దమునకు "ఆకాశము-అఖండము" అను అర్థమును అనుసంధానము చేసుకుంటే అత్యంత సూక్ష్మమైన మహాశక్తి భరితము ఆకాశము.ఐతిహాసిక పరముగా దక్షప్రజాపతి కుమార్తె,కశ్యప ప్రజాపతి భార్య.ఆ మహాపతివ్రత అనుష్ఠాన ఫలితమే ఆదిత్యోద్భవము. అదితీ పుత్ర నమోస్తుతే.
  పలు రకములుగా సృష్టి ప్రకటింపబడి సాగుతుండగా క్రమక్రమముగా రజో-తమో గుణముల ప్రాబల్యత గలవారు దైత్యులుగను,సత్త్వగుణ సంపన్నులు దేవతలుగను వారు గుణములను బట్టి నామరూపములకు సంకేతములైనారు.కర్మానుసారముగా కాలభ్రమణములో దానవులు వీజృంభించి దేవతలపై దెబ్బతీసారు.అంటే రజో-తమో గుణములు చెలరేగి విజృంభించి,సత్త్వగుణమును మరుగున పడేటట్లు చేసినది.

  తమోపహరాయ నమోస్తుతే.చీకట్లను ఉపసంహరించువాడా నీకు నమస్కారములు

  మాతృస్వరూపిణియైన అదితీదేవి ధర్మ సంరక్షణమునకు ఆదిత్యోపాసనయే ఉపాయముగా భావించి,తన భర్త కశ్యప ప్రజాపతి అనుమతిని స్వీకరించి,కఠోర నియమ పాలనతో కర్తవ్యదీక్షాపరురాలైనది.

 " నమస్తుభ్యం పరాం సూక్ష్మాం
   జగదుపకారాయ..గోపతే" 

  గో అను శబ్దమునకు కిరనములు-వాక్కులు అని మనము భావిస్తే స్వామి నీ కాంటి కదలికలతో మమ్ములను చైతన్యవంతులుగా అనుగ్రహించు.నీ వాక్కులతో మా మేథను చైతన్యవంతము చేయి అని పలుపలు విధముల త్రికరణశుద్ధితో ప్రార్థించినది.
  ఏ విధముగా శ్రీకృష్ణపరమాత్మ యశోదమ్మకు తన నోటిలో భువనభాండములను దర్శింపచేసి చమత్కారముగా చిన్నిబాలుడైనాడో,అదే విధముగా సూర్యభగవానుడు తన స్వస్వరూపము అదితీదేవిని దర్శింపచేసి,చమత్కారముగా తన "సుషుమ్న" అనే కిరణము ద్వార ఆమె గర్భవాసమును చేసే వరమును అనుగ్రహించినాడు.

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర.

 ఈ సుష్మ్న కిరణము సకలజగము యొక్క కుండలినీశక్తిని జాగృతముచేగల దివ్య సూర్యశక్తి తేజోపుంజము.

   అదితీదేవి తన గర్భమును స్వామి గ్రభగుడిగా పొందినప్పటినుండి మరింత భక్తిశ్రద్ధలతిఎ కఠోర నియమానుష్ఠానములను పాటించసాగెను.అత్యయ శక్తివంతమైనది సౌరశక్తి వాక్శక్తి.భావి సూచకముగా అది భార్యాభర్తల మధ్య విచిత్ర సంభాషణను ప్రేరేపించినది.కృశించిపోవుచున్న అదితిని చ్హొసి కశ్యపుడు నీ ఉపవాస దీక్షతో గర్భస్థ పిండమును చంపివేయుదువా ఏమి? అని ప్రశ్నించినాడు.దానికి ఆమె నా గర్భస్థ పిండము ఇతరులను చంపునదియే కాని,తాను చచ్చునది కాదని బదులిచ్చుచుండగా మహనీయల మాటల మహిమ తెలుపుటకా యన్నట్లు,తీవ్రమైన తేజ్జస్సుతో ఆ పిండము బయటకు వచ్చేసినది.

  మార అను పదప్రయోగ సంబాషణ సమయమున వెలువడినది కనుక,మృత పిండమునుండి ఉద్భవించినది కనుక,చీకట్లను-అచేతనత్వమును మృతము చేయునది కనుక ఆ పిండమునుండి ఉధభవించిన శక్తి మార్తాండ నామముతో మహనీయమైనది.

  మార్తాండాయ నమో నమః.


త్వష్తా మార్తాండాంశుమాన్-అని ఆదిత్య హృదయము కీర్తిస్తున్నది.

 త్వష్టా అంటే తనను తాను తొలుచుకొనువాడు-మలుచుకొనువాడు.ఆ పరమాద్భుతశక్తి తనను తాను మలుచుకొనవలసిన పరిస్థితి ఏమిటి? అనే సందేహము కనుక మనకు వస్తే,ఒక్క విషయమును మనము గుర్తుంచుకోవాలి.

   కర్మసాక్షి జగత్పాలనకై తనలోనుండి ఎన్నో అద్భుత శక్తులను వాటికి ప్రత్యేకతనిస్తూ రూపగుణ వైభవములతో ప్రకటింపచేస్తాడు.విడిగా కనిపించినప్పటికిని సమిష్టిగా మతా సౌరశక్తియే.

  పౌరాణికముగా సూర్య భగవానుడు విశ్వకర్మ కుమార్తెలైన సంజ్ఞాదేవి-చాయాదేవులకు భర్త.

   వివరములోనికి వెళితే సూర్యుని క్రియాశీలతయే సర్వకర్మలను ఆచరిస్తూ విశ్వకర్మ నామముతో విరాజిల్లుతుంటుంది.ఆ మహాశక్తి తనకు సంక్రమించిన సంజా-ఛాయా శక్తుల సహాయముతో సమిష్టి పాలన జరుగుతుంటుంది.ఇందులో సూర్యుడు-సంజ్ఞ-ఛాయ ప్రధాన పాత్రలు.

విశ్వకర్మ తన కుమార్తె యైన సంజ్ఞా దేవిని సూర్యునకిచ్చి వివాహము జరిపిస్తాడు.అంటే సూర్యుని భార్య సంజ్ఞాదేవి.

" సంజ్ఞ అంటే ఏవస్తువునైనా పోల్చుకోగలిగిన సౌరశక్తి.సంజ్ఞా దేవి సూర్యుని వర్డిని కాంటిని తట్టుకోలేక తన స్థానములో ఛాయను పెట్టి తపమునకు వెడలినదంటారు.అంటే

 " సంజ్ఞ కు సూర్య కాంతిద్వార ఏర్పడు నీడయే ఛాయ" వెలుగు లేక పోతే వస్తు పరిజ్ఞాముండదు.దాని సంబంధిత నీడ ఉండదు.కనుక సంజ్ఞా-చాయ మనము సామాన్యులుగా భావించే స్త్రీమూర్తులు కారు.సూర్యుని భార్యలు కారు.జడపదార్థములు కారు.సూర్యుని నుండి వెలువడి వెలుగును తత్సంబంధ పరిజ్ఞానమును వివరించే తేజోమూర్తులు.

సంజ్ఞా-ఛాయా సమేత సూర్యనారాయణా నమోస్తుతే.

  పురాణ కథనములోని సంకేతనములను సమీకరించుకుంటే "శాకద్వీపములో" స్వామి తనను తాను మలచుకొనునప్పుడు ఆ మహామండలములో గ్రహాలు-నక్షత్రాలు-సకల చరాచరములు అసలు విశ్వమంతా పెద్ద కుదుపులతో భయంకరముగా కదులుతు అకాలప్రళయావిర్భామునకు దారిచూపుతున్నదా అనిపించ సాగినది.అదే కనుక జరిగితే తిరిగి రజో-తమోగుణ విజృంభణతో సత్త్వము సద్దుమణగ వలసిన పరిస్థి ఏర్పడుతుంది.అది అవాంఛనీయము కనుక కరుణతో స్వామి తాను నిలకడగా ఉండి,తనలోని విశ్వకర్మ అనుశక్తికి తనను ప్రసన్నముగా మలిచే బాధ్యను ప్రసాదించాడు.ఎప్పుడైతే సూర్య తనూలేఖనము పూర్తియైనదో,సూర్యభగవానుడు తన తీవ్రతను తగ్గించుకొని,అత్యంత సుందరముగాను ప్రత్యేకముగాను ,

"వివస్వతే ప్రణత హితగా " ప్రకాశించుట మొదలిడినాడు.


  "తేజసః షోడస్సం భాగము మండలస్థ మధురయత" 

తన తేజస్సులోని పదహారవ భాగమును ప్రకటిస్తు-ప్రకాశిస్తు,తన తనూలేఖనమొతో విస్తరిస్తు మనలను అనుగ్రహిస్తున్నాడు.

  నమస్కార ప్రియః సూర్య.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...