పునాతుమాం తత్ సవితుః వరేణ్యం
************************
" లోకంబులు లోకేశుడు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
జీకటికవ్వలనెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".
-బమ్మెర పోతనామాత్యుడు.
అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.
సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.
అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అసలే కానరాని అయోమయస్థితి.
మనము ఆధారములుగా-కారణములుగా వీటిని పరిగణిస్తే వీటికి ఆధేయములు-కార్యరూపములైన పక్షులు-పశువులు-పదార్థములు-ప్రాణులు,పంచభూతములు-పంచేంద్రియములు,అష్టదిక్కులు-భూగోళ-ఖగోళములు,నదీనదములు,సముద్రములు,అరణ్యములు,ఉద్యానవనములు తమ ఉనికిని కోల్పోయిన హృదయవిదారక స్థితి.
బాహ్యము-అభ్యంతరము తమ స్వరూప- స్వభావములు సమసిపోయిన స్థితి.వృధ్ధి-క్షయములు,జనన-మరణములు,సుఖ-దుఃఖములు,సంకల్ప-వికల్పములు,చీకటి-వెలుగులు లేని చింతిత స్థితి.
ఆకార-వికారములు లేవు.పొట్టి-పొడుగు,నలుపు-తెలుపు,ధనిక-పేద,లేదు.జాగ్రత్-నిద్ర-సుషుప్తి అవస్థలు లేవు.అంతా జగము జడముగా మారిన కూష్మాంద స్వరూపము.అంతా చీకటి.నిశ్శబ్దము.శూన్యమో/పరిపూర్ణమో పరిశీలించలేని ప్రమత్తస్థితి.పరవస్తు-స్వవస్తు విషయ పరిజ్ఞానములేని విషయములు విషమించిన ముద్ద,అది జగములు జడముగా మారిన ఒకేఒకటైన ఘనకూష్మాండము.
కాని విచిత్రము.సంకల్పము-వికల్పము రెండును తానైన పరబ్రహ్మము ముద్దుగా తాను ఆ ముద్దలో ఇమిడిపోయినది.అవ్యాజ కరుణతో ఉధ్ధరించుటకు ఉపేక్షను వీడినది.వికల్పమునకు వీడ్కోలు పలికినది.సంకల్ప మాత్రముచే సహస్ర కిరణ తేజోపుంజముగా -శ్రావ్యమైన ప్రణవమును తోదుతెచ్చుకొని తనకు తాను ప్రచ్ఛన్నమును వీడి,స్వఛ్చందమై ప్రకటింపబడినది.
" తిమిరో మదనః శంభో స్పటా మార్తాండాంశుమాన్".
మృతమైన అండము నుండి ప్రకటింపబడి-ప్రకాశించుచున్న తేజమును సకలలోకములు "మార్తాండునిగా" కీర్తించినవి.అదితి గర్భమునుండి గుడ్డుగా జారిపడి,ఉద్భవించిన వానిగా కూడ పెద్దలు కీర్తింతురు.
ఏం మాయ చేసాడో చెప్పలేను కాని అయోమయము మాయమైనది.ప్రకృతి తన స్వస్వరూపమును పాంచభౌతిక రూపములతో బాటుగా ప్రస్ఫుటము చేసుకొనినది.కదలికలు మొదలైనవి.తోడుగా వచ్చిన శబ్ద సహకారముతో
పక్షులు-పశువులు-ప్రాణులు పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి శబ్దములకు ప్రాణప్రతిష్టను చేసినవి.మేఘములనుండి వచ్చు గర్జనలు.చెట్లు గాలి వీచునపుడు చేయు శబ్దములు పర-పశ్యంతిగా పరిగణిస్తే,పక్షుల కూతలు మధ్య అని,భావగర్భిత భాష వైఖరిగా తన విశిష్టతను వివరిస్తున్నది.చేతనత్వముతో నింగి నేల స్నేహ-బాంధవ్యాలను సమృధ్ధిచేసుకుంటున్నాయి.
ఏకము అనేకమై మనతో మమేకము అవుతున్నది.
జగత్చక్షువీక్షణము పాడి-పంటలను,ఖనిజములను-మేధను-ధన-ధాన్యములను,ధార్మికతను క్రమము తప్పకుండా ధర్మమును గాడి తప్పనీయకుండా, తన ఘర్మ-హిమ-ప్రచనద కిరణ సముదాయమును మనకు అనుకూలముగా-అభివృధ్ధికరముగా తనూలేఖనమును చేసుకుంటూ,పగలు-రాత్రి అను విభజనతో పగలు తాను తన కిరణములతో మనలను తాకుతూ,రాత్రివేళ తాను చంద్రునిలో నిక్షిప్తము చేసిన చలువ కాంతులలో మనము సేదదీరునపుడు,తాను మాత్రము,భూమి తనచుట్టు తిరుగుట వలన తాను తాకలేని అవతలి భాగమును సుసంపన్నము చేయుటకు మనకు తాను అస్తమించిన భ్రమను కలిగిస్తూ,అనవరతము శ్రమిస్తున్న ఆ పరంజ్యోతి,
ఉదయపు పూర్వ భాగమైన "బ్రహ్మీ సమయములో,అఖండమూర్తియైన ఆదిత్యునిగను
,ఉదయించువేళ సృష్టికర్తగా "సవితా" నామము తోడను,మధ్యాహ్న వేళ దోషములను హరించు మార్తాండునిగను,సాయంకాల సమయమును ఆర్ద్రతతో అస్తమించు సూర్యునిగను కీర్తింపబడు ,
తత్ సవిత్-ఓ సూర్యదేవా
పునాతుమా-పుణ్యప్రదుడవు
వరేణ్యము-శ్రేష్ఠత్వమును పొందినవాడవు.
ఓ సహస్రార్చి-వేయికన్న ఎక్కువ కిరణములు కల తేజమా!
నీకు అనంతకోటి నమస్కారములు.

No comments:
Post a Comment