Wednesday, January 15, 2020

EMtaTi ADBHUTA CHITRAKAARUDO

 ఎంతటి అద్భుత చిత్రకారుడో-
               ఏమని వర్ణించగలను?
              *******************

    భూమండలమును గిరగిర తిప్పిస్తూ,తాను నిశ్చలముగా నున్నప్పటికిని,భూమి నిశ్చలము,తాను తిరుగుతున్నాను అనే భ్రమను మనకు కలిగించే అద్భుత చిత్రకారుడు.

 అవ్యక్తము వ్యక్తము కావాలంటే అంతర్మథనము జరగాలి.అవరోధాలను అడ్డుకోకలగాలి.అస్పష్టత తొలగాలి. ఏ విధముగా సినీమా తెర నిశ్చలముగా ఉండి,అనేక చిత్ర కదలికలను మనకు అందిస్తుందో అదేవిధముగా మూలతత్త్వము అనేక రూపములలో వ్యక్తమగుతు మనకు అవగాహనను అందిస్తుంది.ఖండించలేని-కాదనలేని నగ్నసత్యము.నమ్ముదాము-నమస్కరిద్దాము.


" కిరతి" అనగావెదజల్లు స్వభావము కలది.వెదజల్లు స్వభావము గలవి కిరణములు.

1. సహస్ర కిరణములతో సప్తవర్ణములను గగనమున ఇండ్రధనుస్సుగా,భువనమున బహుమేధతో చిత్రిస్తున్నప్పటికిని,తన చేతులను మనకు కనిపించనీయడు.

2.ఆకాసము శబ్దవాచకము అని పెద్దలు చెబుతారు.గాయత్రి-బృహతి-ఉష్ణిక్-జగతి-త్రిష్ణుప్-అనుష్టుప్-పంక్తి అను ఏడు ఛందస్సుల ఉత్పత్తికి కారణమైనప్పటికిని,మనతో మౌనముగానే ఉంటాడు.

3.గ్రహ హోరలలో (అహోరాత్రుల) ఉదయిస్తూ,అనంతకాలమును సెకను నుండి శకము వరకు మనలను భావింప చేస్తాడు.

 4.అమ్మలా తన కిరణములతో మనకు అన్నము పెడతాడు.కాని తన ఒడిని చేరనీయడు.

 5.అయ్యలా వేదవిజ్ఞానమును మనకు అందిస్తాడు కాని చనువిచ్చి వాదనలు చేవ్యనీయడు.

 6.మిత్రునిలా ఖనిజ సంపదలను కానుకల్;అను అందిస్తాడు కాని మననుండి ఏమి ఆశించడు.

7.ౠతుధర్మములకు అనుగుణముగా తన శక్తిసామర్థ్యములను మలచుకుంటు,మన మీది వాత్సల్యమునకు ఋజువుగా మారతాడు.

8.     భూత-భవిష్యత్-వర్తమాన కాలములను త్రి నాభులతో,ఐదు ౠతువులను ఆకులతో,అనంతకాలమనే ఒకేచక్రముగల రథమునకు,అనూరుడు అను స్థితి శక్తిని సారధిని చేసి,ఏదుగుఋఋఅములను గతి శక్తులను జతపరచుకొనినను,ఆభిజాత్యమును ప్రదర్శించనివాడు.
9.మయూరకవి వ్యాధిని మాయము చేసినవాడు -సన్నుతి చేస్తుంటే సంయమనము పాటిస్తుంటాడు.
10.  ఆదాన-ప్రదానములు అన్నివేళల చేస్తూ అఖిలజగములను ఆనందింపచేస్తాడు.

    రాత్రి అను పాము చెక్కటి అను విషమును చిమ్ముటచే,అసమర్థములైన ఇంద్రియములతో,శ్వాస మాత్రము మిగిలి జీవులు తమోమయులై నిద్రించుచుండగా,వారిని తన కిరణములను ఔషధముతో చేతనులుగా మలచు " ఏకం-అద్వితీయం బ్రహ్మం" ను నేనేమని వర్ణించగలను,

 

 తత్త్వము తలచుకోగానే నేనమగలను వానిని "తం సూర్యం ప్రణమామ్యహం" తప్ప.స్వస్తి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...