వైభవోపేతమైన "నభశ్ మాసము రానే వస్తున్నది.సూర్యనారాయణుడు దేవతలను శత్రువుల నుండి రక్షించుటకు,భవనభాండములను ఐశ్వర్యవంటము చేయుటకు "ఇంద్ర" నామధారియై బయలుదేరుచున్నాడు.అంగీరస ముని మంగళాశాసనములు దిగంతములను చైతన్యవంతము చేయుచున్నవి.ప్రమదముతో అప్సరస ప్రమలోచ హావభావ నాట్యమునకు దీటుగా గంధర్వుడు విశ్వవసు గానము వీనులవిందు చేయుచున్నది.సర్పశ్రేష్టుడు ఎలపాత రథ పగ్గములను పటిష్టము చేయుచు,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు శ్రోత స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధించుచున్నాడు.వార్య రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా,అందరిని బ్రోచుటకు ఇంద్రుడు తన కిరణప్రసార ప్రయోజనమునకు ఉపక్రమించాడు.
తం ఇంద్రం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment