వ్యాపక లక్షణము కల పరంజ్యోతి వివస్వన్ నామధారియై విశ్వపాలనకు ఉపక్రమించుచున్న శుభతరుణమున భృగుమహాముని వేదపారాయణమునను మోదముతో ప్రారంభించి,స్వామి రథమునకులాంఛన ప్రాయముగా మార్గమును చూపించుటకు సన్నధ్ధుడగుచున్నాడు.అగ్నితత్త్వధారియైన ఆ పరమాత్మను ప్రస్తుతిస్తు అనుంలోచ అను అప్సరస అడుగులు కదపసాగగానే,ఉగ్రసేనుడను గంధర్వుడు ఉత్సాహముతో గానమును ప్రారంభించాడు.శంఖపాలుడను సర్పము పగ్గములను పరిశీలించి పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు అశరణుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తూ గమనశక్తిని గమనిస్తున్నాడు.వ్యాఘ్రనామ రాక్షసుడు రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా నభస్య మాస వైభవమును అందీయుటకు వివస్వంతుడు వెడలుచున్నాడు.
తం వివస్వన్ ప్రణమామ్యహం.
తం వివస్వన్ ప్రణమామ్యహం.
No comments:
Post a Comment