Sunday, October 4, 2020
PRASEEDA MAMA SARVADA05
ప్రసీద మమ సర్వదా-06
స్కందమాత నమోనమః
సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ
అరవ నవదుర్గ స్కదమాతాదేవి.కూష్మాందా మాత అండరూపములో సమస్తమును తన గర్భములో నిక్షిప్తము చేసునినది కదా.దానిని ధర్మ రక్షనకు ప్రకటించవలసిన సమయమాసన్నమైనందున స్కందమాత గా అమ్మదనముతో మనలనందరిని తారకాసురుని బారి నుండి నెమ్మదింపచేయుటకై తన జాన-క్రియాశక్తులను శివశక్తితో కలిపేసి స్కందుని దేవసేనాధ్యక్షునిగా చేసినది తల్లి.
స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును వాయువు-అగ్ని దాచిన గంగ దేవి ఒడిని చేరినదట.ఆ తల్లి ఆ దివ్యతేజమున రెల్లునందు దాచినదట. రెల్లునుండి తారకుని దుందగములను చెల్లు చేయుటకు అద్భుత బాలురు ఆవిర్భవించిరట.కృత్తిక నక్షత్ర శక్తులు ఆరు ఆ బాలునికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షన్ముఖుని ఆరు ముఖములు పంచభూత తత్త్వమునకు-ఆత్మతత్త్వమునకు అద్దముపట్టుచున్నవి.
అవ్యక్తం-వ్యక్తం-మహత్-అహంతత్త్వం పంచభూతాత్మికమై ప్రాణికోటిగా పరిఢవిల్లుతోంది.మనలో దాగిన నీవారసూక పరమాత్మ కానరాకుండ గుహ్యమై ఉంటుండి కద.ఆ సక్తియై ధర్మసంస్థానమునకై అదే గుహ్యుడు.శక్తి ప్రాణ శక్తిగా ప్రకటింపబడుట-పరిస్థితులను చక్కదిద్దుట ,దానికి మూలమైన మహాశక్తి మాతృరూపముగా మనకు ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తుల మేలుకలయిక సంస్కారమును మేలుకొలుపుటే అని వివరించుట .చేయవలెనను సంకల్పము తటస్థస్థితివంటిది.కాగౄత కుండలిని అది.దానిని జాగృత పరచవలెన్న జ్ఞానశక్తి అవసరమైన.జాగృత కుండలిని తన ఊర్థ్వ ప్రయాణములో అడ్డుపడు తారకుని వంటి ముడులను విప్పుకునే క్రియాశక్తి తప్పనిసరి.ఈ మూడు శక్తులు సమర్థవంతమైతేనే సాధకుడు అమృతపానముచేయగలుగుతాడు.సాధకుని ఈ మూడుశక్తులు సేనలైతే వాటిని నడిపించే అద్భుతశక్తి సేనాపతి.
జ్ఞానము క్రియాశీలకత్వముగా మారుట స్కందోత్పత్తి అయితే ఆ క్రియాశీలకత్వమునకు కృతకృత్యతను అందించేది స్కందమాత శక్తి
అమ్మ చెంతన్నున మనకు అన్యచింతనలేల?
అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరణము.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment