Tuesday, October 6, 2020
PRASEEDA MAMA SARVADAA-06
ప్రసీద మమ సర్వదా-06
కాత్యాయినిదేవి నమోనమః
" చందరహాసోజ్వలకరం శార్దూల వరవాహనం
కాత్యాయినీం శుభం ధధాత్దేవి దానవ ఘాతినీ"
దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా"
కాత్యాయినీ మాత గుహ్యాతిగుహ్యముల గూఢతత్త్వము.పురుషసూక్త ప్రకారము తల్లి సమస్త విశ్వములోని నాల్గవ భాగమును మాత్రమే ప్రపంచముగా మనకు వ్యక్తముగా ప్రకటించి,మిగిలిన మూడు భాగముల అమృతమయమైన అవ్యక్తమునకును అధిస్ఠాత్రియై అలరారుచున్నది.
నామరూపములను పరిశీలిస్తే,దైవకార్యార్థము "కతుడు" అనే ముని పుంగవుని ఆశ్రమములో జన్మించి-పెరిగినందున కాత్యాయినీ నామముతో కీర్తింపడుతున్నది తల్లి.తల్లి స్వభావమును పరిశీలిస్తే జ్ఞాన విజ్ఞతను అందిస్తూనే దానికి ఏల క్రియాశీలకత్వమును అనుసంధిస్తుందో సాక్షాత్తు గాయత్రీ స్వరూపముగా సకల శాస్త్ర విజ్ఞానమును సంహార రూపముతో యోధ గా క్రియాశక్తిని మేళవించి వాటిని సఫలీకృతము చేస్తుంది తల్లి.
మరొక్క ముఖ్యమైన విషయము తల్లి తాను క్రోధస్వరూపిణిగా ఆవిర్భవించినది.కాని దానికి అరిషడ్వర్గములు కావు.కామ-క్రోధముల ఫలితములు వానిని ప్రేరేపించిన మూలకారణల బింబ-ప్రతిబింబములు.తల్లి ధర్మము నాలుగు పాదములతో నడువవలెనని,గ్లాని ఎటువంటి దుష్టశక్తుల ప్రకోపనముచే లోపించరాదని కోరుకున్నది.కాని అసురీశక్తుల అహంకారముతో ధర్మము క్షీణదశలోనుండి లుప్తమై పరిస్థి ఏర్పడినప్పుడు క్రోధము తల్లికి సహాయకారియై లీలగ ప్రకటింపబడుతుంది.అదే మహిషాసుర-కాత్యాయినీ యుధ్ధమునకు కారణమైనది.సమర్థనీయము కదా.బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశమే కాత్యాయినీ తత్త్వము.తనను నమ్మిన వారికి ఏకాగ్రతను-నిబధ్ధతను కలిగిస్తుంది.
శీఘ్ర కళ్యానమునకు-అనుకూల దాంపత్యమునకు గోపికలు తల్లి ఆండాళ్ తో కాత్యాయిని వ్రతము చేసినట్లు "తిరుప్పవై" రెందవ పాశురము తల్లిని ప్రస్తుతించుచున్నది.గోర రూపిగా దుష్ట శిక్షణను-అఘోర రూపిగ జ్ఞాన రక్షణను చేస్తూ,నీ అనుగ్రహముతో మమ్ములను పాలించు తల్లీ,నీ పాదములు విడువమమ్మా.
అమ్మ చెంతన అన్య చింతనలేల?
అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరణము.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment