Wednesday, October 7, 2020

PRASEEDA MAMA SARVADAA-07

ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరలమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారాథమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రా చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొని ఆనందాబ్ధిలో తేలియాడుతుంటారు. మనశరీరమే ఆయుధగారము.మన ఇంద్రియమే మనకు సహాయకారి అను విష్యమును కాళరాత్రి మాత ఆదిశక్తి నుదురునుండి ఆవిర్భవించి,వరప్రసాదుడైన రక్తబీజుని అంతము చేయుటకు,తన నాలుకనే ఆయుధముగా మలచుకొని,విస్తరింపచేరి రక్తబిందువును తాను స్వీకరిస్తూ,వానిని శక్తిహీనునిగా (రక్తహీనునిగా) చేసి,సంహరించినది. అసురుని రక్తము అమ్మను ఆవేశముతో భీకరనాట్య ప్రక్రియగా అడుగులను కదిలించినది.తల్లి అడుగుపడిన భూమి నిర్వీర్యము చేస్తున్నది.ధర్మము అధర్మరక్త ప్రభావమునకు బలికాకూదదు.కరుణతో శివిడు తటస్థుడుగా అమ్మ గమనముగా అడ్డుగా పడుకుని,అమ్మను శాంతింపచేసినాడు. కాలమే కాళరాత్రి.అది.మనకున్నట్లు దానికి భూత-వర్తమాన-భవిష్యత్ దశలుందౌ.అద్భుతసక్తివంతమైన కాలము తన ప్రయాణములో మనలను(జీవులను)తనతో ప్రయాణింపచేస్తూ,సమయము వచ్చినప్పుడు మనలను విడిచివేస్తుంది.దాని వలన ఎమి ప్రయోజనము అను సందేహము రావచ్చును.మన తప్పటదుగుల సమయమున మనలను తన చేతిని పట్టి నడిపించిన అమ్మ మనకు నడక వచ్చిన తరువాత నడిచేతప్పుడు వదిలివేస్తుంది.అదే విధముగా కలస్వరూపమైన కాళరాత్రి మాత తనతో కలిసి మనము చేస్తున్న ప్రయాణములో కొన్ని అద్భుతాలను చూపిస్తూ,ఆవేదనలను కలిగిస్తూ,అత్మ శోధనకై మనలను సవరిస్తూ-సంస్కరిస్తూ,సాధక దశ నుండి ముముక్షువుగా మలుస్తూ,స్వయంసిధ్ధతను అనుగ్రహిస్తూ,మనలను విడిచివేసి,తన ప్రయానమును కొనసాగిస్తుంది. అమ్మ చెంతన నున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...