Thursday, October 8, 2020

PRASEEDA MAMA SARVADAA-INTRODUCTION

ప్రసీద మమ సర్వదా నవదుర్గ మాతా నమో నమః యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్ఠం కాత్యాయినీతి సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిధ్ధిధాత్రీచ నవదుర్గ ప్రకీర్తితః." వేద-వేదాంతవిదులు తల్లి అనుగ్రహించిన విజ్ఞతతో నవదుర్గావిర్భావ ప్రాశస్త్యమును పారమార్థికముగా అందించుటయే కాక ప్రాపంచిక మాయ యను సాగరమున మునిగి ,దారి-తెన్ను తోచని సామాన్యునకు- సాధకునకు సన్మార్గమును చూపుతు సద్గతిని చేర్చే చల్లని తల్లి కనుకనే " కుమాతా న భవతి" అని ఆర్యోక్తి. మొదటి దుర్గ శైలపుత్రి మన ఆత్మ పరిశీలనమునకు నాందిపలుకుతుంది.రెండవ దుర్గ బ్రహ్మచారిణి పరిశీలనను ప్రయాణముగా మారుస్తున్నది.మూడవ దుర్గ ప్రయణ ఫలితమునకు ఘోరములను అఘోరములుగా మారుస్తూ,ఆత్మ దర్శనమునకు అనువైన సహాయమును చేస్తున్నది.నాల్గవ దుర్గ కూష్మాణ్డాదేవి స్థూల-సూక్ష్మములను అంద రూపములో పరిచయము చేస్తూ,వానిని అలవోకగా-అలసటలేకుండా నిక్షిప్తము చేస్తూ,నిఖిల నూతనత్వమును సూచిస్తున్నది.ఐదవ దుర్గ స్కందమాత తానొక అద్భుతసృష్టికి అమ్మయై జన్మసార్థకత జయనికేతనమును ఎగురవేస్తున్నది. ఆరవ శక్తి అమ్మతనమును .అది అందించిన అద్భుతశక్తుని ఆవశ్యకతను,అరిషడ్వర్గముల ఉనికిని,వానికి ఆలంబన అయిన ఇంద్రియ చర్యల ఫలితములను దర్పణమై దర్శింపచేయుచున్నది.ఏడవ శక్తి కాళరాత్రి రూప అశాశ్వతత్త్వమును-ఆత్మ శాశ్వతత్త్వమును ఆవిర్భవింపచేస్తు,విశ్వకళ్యానమునకు తన్ను తాను మలచుకొను మహత్ విన్యాసమును మనముందుంచుచున్నది.ఎనిమిదవ దుర్గ యైన మహాగౌరి " క్షమయా ధరిత్రి"తన తేటతెలుపు మేని కాంతితో అజ్ఞానమను నల్లని చీకట్లను తరిమివేసి,గౌరవమను ప్రసాదించునది.పదవ దుర్గ తరణోపాయయై ఉన్నస్థితి నుండి ఉత్తమస్థితిని చేర్చగల సిధ్ధిధాత్రి. ఈ పదిరోజులు అమ్మ పరిపూర్ణ అనుగ్రహమును పొందుటకు ప్రయత్నిద్దాము. అమ్మ చెంతన ఉన్న మనకు అన్య చింతనలేల? అమ్మ దయతో ప్రయానము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...