Friday, October 9, 2020
PRASEEDA MAMA SARVADAA-09
ప్రసన్న మమ సర్వదా-09
మాత సిధ్ధిధాత్రి నమోనమః
"సిధ్ధ గంధర్వ యక్షాద్యైః అసురైః అమరైరపిః
సేవ్యమానా సదా భూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయినీ".
ధాత్రీ అను శబ్దమునకు అనుగ్రహించునది-ప్రసాదించునది అని అర్థము.అమ్మ మనకు సిధ్ధులను ప్రసాదిస్తుంది కనుక సిధ్ధిధాత్రి నామముతో కీర్తింపబడుచున్నది.తల్లి మనతో పాటు ఉంటూ,మనలను చైతన్యవంతులను చేస్తూ,సన్మార్గమును చూపిస్తూ,దానికి కావలిసిన సిధ్ధులను అనుగ్రహిస్తుంటుంది.
మనలోని సద్గుణాల సమ్మేలనమే సిధ్ధులు.కాని ముఖ్యముగా అష్టసిధ్ధులు మనకు అనేక విషయములను తెలియచేస్తాయి.వాటికి అనుగునముగా మన ఇతిహాస కథలు వాటి ఉపయోగవిధానమును మరింత వివరించినవి.ఉదాహరనకు సూక్ష్మావస్థలో కూడా భగవ్తత్త్వమును గ్రహించగలగటము అణిమ-భగవతత్త్వమును అన్నింటా దర్శించకలగటము మహిమ-అంటే సూక్షముగా -స్థూలముగా నున్న భగతత్త్వమును గుర్తించగలుగుట.గరిమ-లఘిమ మరొక రెండు సిధ్ధులు.అతి తేలికగా మారుట-అత్యంత బరువుగా (రూపములో ఏమార్పులేకుండ) మారుట.ప్రాప్తి-ప్రాకామ్యము మరొక రెండు శక్తులు.శూన్యముగా పైకి కనిపించేదానిలో శక్తిని గ్రహించగలుగుట ప్రాప్తి అయితే దానిని పొందగలుగుట ప్రాకామ్యము.ఈశిత్వము-వశిత్వము చివరి రెండు అష్టసిధ్ధులు.ఈశావాస్యం ఇదం సర్వం అని గుర్తించగలిగితే ఈశిత్వసిధ్ధి అనుగ్రహమే-తద్వార మన ఇంద్రియములను మంచిపనులకు మాత్రమే నియంత్రించగలిగితే అదియే వశిత్వసిధ్ధి.సుందరకాందలో హనుమ ఈ శక్తులను ప్రదర్శించి స్వామికార్యమును సఫలము చేసుకొనినాడు.కృఇష్నపరమాత్మ సమయసందర్భములకు తగినట్లు వానిని ప్రదర్శించి ప్రస్తుతింపబడుచున్నాడు.
ఇప్పుడు సిధ్ధిధాత్రి మాత తత్త్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.మన పరతత్త్వ చింతన పర్వతము నుండి ప్రారంభమై పరిణిటి పొందిన ప్రతిభ వద్ద ముగినది.అంటే మనము మనలోనిక్షిప్తమైన శక్తిని ఎంతో లోతునుమ్న నిలిచి చూశాము.అందుకోవాలని అడుగులను ఊర్థ్వముఖముగా కదిపాము.ఎన్నో నిత్యసత్యములను నిస్సందేహముగా నేర్చుకున్నాము.ఎనిమిది శక్తులు ఎదోఒక విపత్తును నిర్మూలించుటకు,ఎంతో ఉన్నతమైన తత్త్వమును నేర్పించుటకు ఆవిష్కరింపబడినవి.
అమ్మ చేయి పట్టుకుని మనలను నడిపిస్తూ,ఎన్నో పనులను నేర్పిస్తూ,గుడ్డులో దాగిన పదార్థము వంటి మనలను గట్టి రెక్కలను అందించిన పక్షులుగా తీర్చిచిద్దినది.సిధ్ధిధాత్రి మాత్ర వద్దకు మనము వచ్చాము.ఇప్పుడు అమ్మ అసురసంహారము చేయవలసిన పనిలేదు.ఆగ్రహమును వ్యక్తము చేయవలసిన పని లేదు.
ఇప్పుడు మనకోసము ఎక్కడినుండో-ఏదో ఒక రూపముతో-ఏదో ఒక ప్రయోజనము కోసము ఆవిర్భవించవలసిన పనిలేదు.అమ్మ ఇప్పుడు దిగిరాదు.తిరిగి కొత్తావతారమును ధరించుతకై వెళ్ళిపోదు.మనతో పాటుగా తానుండి మనలో వచ్చిన పరిణితి పారిపోకుండా హెచ్చరికలు చేస్తూ,ముచ్చటగా మనతోనే-కాదు కాదు మనలోనే ఉంటుంది మాతృరూపిణిగా.మరింక కావలిసినదేముంది మనకు.
అమ్మే అండదండ యైనప్పుడు బ్రహ్మానందమే.
అమ్మ ధ్యాసే మన శ్వాసగా జీవిద్దాం.
శుభం భూయాత్.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment