Wednesday, November 11, 2020

MEEDHUSTAMA SIVATAMA-16

 


  మీడుష్టమ శివతమ-16

  **********************  


  న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.


   ఆలోచనలో పడ్డాడు సాధకుడు.ఈ రుద్రుడు ఎంత చమత్కారి.ప్రతిదానిని తన చమత్కారముతో సమర్థిస్తు సత్యమునేచెప్పానంతాడు.అల అంటాడు-జలమంతాడు.రెండింటీ చేరువేరుగా భావించమంటాడు-భాషించమంటాడు-భాసించమంటాడు.


  అల సముద్రము లోనిదే.జలము సముద్రము లోనిదే.అయినప్పటికిని సముద్రములోని జలము కెరటమై కొత్తరూపుదిద్దుకుని ఘోషిస్తూ ఉప్పొంగుతు ఉరకలువేస్తూ తీరమువరకు వస్తున్నది.తీరమును తాకగానే జలముగా మారి కడలిలో కలిసిపోతున్నది.తీరమును చేరగానే దాని నామరూపములు శబ్దములు సమసిపోయాయి ఎందుకంటే అదితీరమును దాటిరాలేని అసహాయురాలు.అయితే ఈ కడలి అలకు నా అభ్యర్థనకు కల సంబంధమేమిటి?నడుస్తూ నడుస్తూ తీరానగల జిలేబి కొట్టుదగ్గరకు వచ్చాడు సాధకుడు."న అమిత్రంచమే-అభయంచమే" అనికదానేను అర్థించాను.సరేనన్నాడు సాధనచేయమంటున్నాడు.


  సరైనసమయమిదేనని సాక్షాత్కరించాడు రుద్రుడు.ఆవేశపడలేదు-ఆరోపణలు చేయలేదు ఈసారి సాధకుడు.అసలు రుద్రుడేమిచెబుతాడోచూడాలి అనుకుంటూన్నాడు.చమత్కారి కద చంద్రశేఖరుడు.జిలేబి బండి దగ్గర ఆగి పిండిలో వేయించిన చుట్టలను (పాకములో వేయని) ఇచ్చి జిలేబి తిను అన్నాడు సాధకునితో.ఇదేమి జిలేబి రుద్రా.ఇది ఒక వేయించిన పిండిచుట్ట.ఆహా! అలాగా.అయితే ఇది జిలేబిగా ఎప్పుడవుతుంది? అమ్మయకు ప్రశ్న ఆ రుద్రుని నుండి.మధురతను అందించే పాకములో ఇది మునగలేదయ్యా రుద్రా.దీనికి రుచి రావాలంటే దీనిని తీపి పాకములో ముంచితీయవలసినదే.అప్పుడే అది మధురముగా మారుతుంది.రసానుభవమును కలిగిస్తుంది అంటుండగానే రుద్రుని ఆంతర్యం అవగతమయినది సాధకునికి పిండిచుట్లను మధురములుగా భావిస్తూ వాటిని నిందిస్తూ,వాటిలో దాగిన రసమును గ్రహింలేని నన్ను చెప్పకనె చెప్పుతూ తప్పులు దిద్దుతున్నాడు రుద్రుడు.


    కదుపుతున్నాడు సాధకుడు తన ఆలోచ్నలను అడుగులతోపాటు.తోలుబొమ్మలాట మొదలైనది.బొమ్మలను తనచేతికున్న దారముతో పట్టుకొని ఆడిస్తున్నాడు ఆతగాడు.కొన్ని బొమ్మలు మరికొన్ని బొమ్మలను దండించుచున్నవి  పౌరుషముతో.మరికొన్ని దండింపబడుచున్నవి అసహాయతతో.నిజమునకు ఆ బొమ్మలుకావు ఆ పనులను చేస్తున్నవి.విస్మయుడైనాడు సాధకుడు.ప్రస్తుతింపబడుతున్నాడు రుద్రుడు.


   అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


 కదిలేవి కథలు-కదిలించేది కరుణ


  ఏక బిల్వం శివార్పనం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...