Wednesday, November 11, 2020

MEEDHUSHTAMA SIVATAMA-15

 


 మీడుష్టమ శివతమ-15

*********************


 న రుద్రో రుద్రమర్చయేత్.


 ఎవరెవరు ఎటువంటి వారో పరికించి-పరిశీలించి-పరీక్షించి పట్టికను సిధ్ధము చేయాలి.రుద్రునికి రాగానే అందించాలి.అభయమును పొదాలి అనుకుంటు ఫలానా వాడుకదా నామీద ఈర్ష్య పడతాడు.ఫలానా వాడుకదా నా మాటలు కోతలు అన్నాడు.ఫలానా వాడుకదా నా ముందు మంచిమాటలు మాటాడి,నా వెనుక విమర్శించినది.ఒక్కొక్కడిని కలిసి -కూపీలు లాగి-నాపైగల వైరభావమును తీర్మానిస్తాను అంటూ కదిలాడు సాధకుడు.


 ముందరగా పక్కింటువాడిని కలవటానికి వాడి గుమ్మము దగ్గరికి వెళ్ళాడో లేదో అక్కద రుద్రుడు త్రిశూలధారియై కావలికాస్తున్నాడు.నన్ను లోపలికి అనుమతించుట లేదు.అదేదో గారడిచేసాడువాడు అనుకుంటూ ఎదురింటికి వెళితే అక్కద రుద్రుడు త్రిశూలధారియై కావలి కాస్తున్నాడు.ఎక్కడికెళితే అక్కద రుద్రుడు అడ్డుపడి వారిని కలిసి మాట్లాదనీయడములేదు.ఏదో మాయలా ఉంది.నాతో సరేనంటాడుకదా అలాగే వారితో కూదా సరేననింటాడు.నాకు పనిని అప్పగించి  కానీయౌండా అడ్డుపడుతుంటాడు.ఆరితేరిన మోసగాడు వాడు అంటూ అల్లకల్లోలమైన మనసుతో అలల తీరములో నడుస్తున్నాడు సాధకుడు.కనుకనే నేను వితరణగా వరములనిస్తానని వికిరిద అని స్తుతిస్తారంటాడు.నాకు మిత్రులు మాత్రమేకావాలంతే సరేనంటు వారికి మిత్రుడిగా మారి కావలి కాస్తున్నాడు.


  చెడ్డవారికి చేరువగాఉండే ఓ దొడ్డ రుద్రా! ఇంక నీ   మాటలు నమ్మనుగాక నమ్మను.ఎందుకయ్యా మార్చుకోవు నీ పధ్ధతి? అని అంటుండగానే అతనివద్ద నిలిచాడు రుద్రుడు.


    తరిమివేద్దాము నీ సత్రువులను తయారుచేసావా  పట్టికను? ఏది చూపించు అంటు ఏమి తెలియని వాడిలా అడిగాడు.


  ఆపురుద్రా  నీ ఆటలు.ఆడిన మాతను తప్పేవాడిని నా ఆసరా అనుకుని ఇన్నాళ్ళు ఎంత మోసపోయాను.అసలు ఇకనుంచి నీ మాటలను నమ్మను గాక నమ్మను.ఈ సముద్రమే సాక్షిగా చెబుతున్నాను.పోయిరా.పెద్ద మాటలిక చాలు.ఆవేశముతో ఉన్నాడు సాధకుడు.ఆలోచింపచేయాలనుకున్నాడు రుద్రుడు.


    సముద్రము సాక్షి అంటున్నావు కదా ఇంతకి సముద్రములోని జలము సాక్షిగానా/లేక అలల సాక్షిగానా.నీవు నాతో ఫలానా-ఫలానా అని చెబుతున్నావు కదా.వారి ఈ కదలి జలము వంటివారా/అలలవంటి వారా?


   ఆలోచనలో పడ్డాడు సాధకుడు-అదృశ్యమయ్యాడు రుద్రుడు.


   అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే

  

   కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


   ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...