Tuesday, November 10, 2020

MEEDUSHTAMA SIVATAMA-14

 


    మీఢుష్టమ శివతమ-14

    *********************


 న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.


     రుద్రుడు తనను శిష్యునిగా స్వీకరించినందుకు ఆనందాబ్ధిలో మునకలువేస్తున్నాడు సాధకుడు.కాని అది కొంచంసేపటికే అనుమానరూపముగా మారి సాధకునికి ఒక సందేహమును కలిగించింది.రుద్రా నువ్వెంత చమత్కారివయ్యా.కార్య కారనములు రెండు నీవే అయినప్పటికిని కాసేపు సరదాగ సాధకుని చిత్తములో చేరి చిత్రాలు చేస్తావు.


    అసలేనేను-రుద్రుడు పరస్పరము కలుసుకుంటున్నామని-సంభాషించుకుంటున్నామని సహించలేకపోతున్నారు.మా అనుబంధమును సమన్వయించుకోలేక పోతున్నారు.ఇప్పుడు నేను వారితో రుద్రుడు నన్ను శిష్యునిగా  స్వీకరించి- అనుగ్రహించబోతున్నాడంటే పెద్ద ప్రమాదమే.శ్రేయోభిలాషులమంటూనే శాపనార్థాలు పెడుతుంటారు.అమ్మో.


  ఇప్పుడింకవస్తాడుగా ముస్తాబై పాఠముచెబుతానంటూ.ఈ నాటి నా పాఠమే వారికి గుణపాఠము కావాలి అనుకుంటున్నాడో లేదో రానే వచ్చాడు రుద్రుడు.


     సంకోచిస్తున్నాడు సాధకుడు తన  అంతరంగమును ఆవిష్కరించడానికి.అంతా సిధ్ధమేనా అంటున్నాడు రుద్రుడు ఆలస్యము చేఊకుండ.ఆలోచనలో నున్న సాధకునితో సరేలే రేపు ప్రారంభిద్దాములే అంటు అడుగు కదపబోతున్న సమయములో ఆగు రుద్రా! అంత తొందరెందుకు?అడుగుతావు-బదులు వినకుండానే బయలుదేరుతానంటావు.భలేవాడివయ్యా గురువా.


   సరే అయితేచెప్పు సమాధానము నిదానంగా అన్నాడు రుద్రుడు.


  ఇక్కడున్న వారందరు మన అనుబంధమును చూసి ఈర్షపడుతున్నారు.కాసేపు ఈసడిస్తున్నారు.కోతలంటున్నారు.కోపగించుకుంటున్నారు.ఎటుచూసినా నిరసనలే.

 కనుక మొట్టమొదట నేను నీతో నాకు శత్రువులు-అదే మిత్రులుకానివారు నాకు లేరని చెప్పాలి." అనమిత్రంచమే" అనమిత్రంచమే' అని నేను నిన్ను అర్థించాలి.నువ్వు నా అనుగ్రహించి ప్రయత్నమును సమర్థవంతము చేయాలి.ఎటువంటి ప్రలోభములకు లోను కాకుండా నేను నా సాధనను కొనసాగించాలి.అప్పుడు నేను దేనికి భయపడను.ఆగాగు.నిన్ను "అభయంచమే" అని కూడా అర్థించాలి.అనగానే ఇదంతా బాగానే ఉంది.కాని నాకొక చిన్న సందేహము.నీ మిత్రులు ఎవరో-మిత్రులు కానివారెవరో నాకు తెలియాలి కదా.కనుక నేను మళ్ళీ వచ్చేలోపుల గుర్తించి ,నాకు తెలియచేయి అంటూ అంతర్ధానమయ్యాడు రుద్రుడు ఆశీర్వదిస్తూ.


   అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.

  

    కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


   ఏక బిల్వం శివార్పణం. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...